మారుతారు: రఘుపై కెటిఆర్, కుటుంబంలో విభేదాల్లేవు

రఘునందన రావు విషయంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘునందన రావు తమ పైన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఆయనపై పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఆయన పచ్చి అవకాశవాది అన్నారు. ఆయన తన నోటిని అదుపులో పెట్టుకోవాలన్నారు. తమ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవనన్నారు.
కాగా, తాను వస్తుంటే రెండు వాహనాల్లో రెక్కీ నిర్వహించారని, ఫోన్లు చేసి చంపుతామని బెదిరిస్తున్నారని రఘునందన రావు శుక్రవారం డిజిపి దినేష్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. కొన్ని వాహనాల నంబర్లను కూడా ఆయన ఇచ్చారు. తన కుటుంబానికి కూడా ప్రాణహాని ఉందన్నారు.
పద్మాలయ విషయంలో తాను హరీష్ రావుపై విమర్శలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రఘునందన్ వినతి పత్రం స్వీకరించిన డిజిపి.. మెదక్ ఎస్పీని కలవాల్సిందిగా సూచించారు. రఘునందన్‌కు రక్షణ కల్పించాల్సిందిగా ఎస్పీని ఆదేశించినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications