హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్లేడుతో మర్మాంగాలు కోసి స్నేహితుడి దారుణ హత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: మద్యం మత్తులో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్న సంఘటన రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జరిగింది. అతిదారుణంగా గొంతు, మర్మాంగాలు కోసి మృతుడి ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకు తలపై బండరాయితో మోది దారుణంగా హత్య చేశారు. కుత్బుల్లాపూర్ పరిధి వాణినగర్‌లో నివాసం ఉండే షాదుల్లా కుమారుడు పాషా పండ్ల వ్యాపారి.

అదే ప్రాంతంలో ఉండే మహేష్, రాజులతో కొద్ది రోజులుగా స్నేహం చేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం వీరు ముగ్గురు కలిసి దత్తాత్రేయనగర్ కల్లుకాంపౌండ్ వద్ద చీకటి పడేంతవరకు కల్లు సేవించారు. తనకు పని ఉందంటూ రాజు మధ్యలోనే వెళ్లిపోగా పాషా, మహేష్‌లు బాగా మద్యం సేవించారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తలెత్తిన వివాదంలో పాషా... మహేష్‌ను దూషించాడు. కొంత అసభ్యకరంగా మాట్లాడాడు.

దీంతో కోపోద్రిక్తుడైన మహేష్.. పాషాను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. పాషాను మాటల్లో పెట్టి ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ సమీపంలో నిర్మానుష్యంగా ఉన్న ఓ వెంచర్‌లోకి తీసుకెళ్లాడు. అక్కడ బ్లేడ్‌తో పాషా గొంతు కోశాడు. ఆ తర్వాత మార్మాంగాలు కోసి.. అంతటితో ఆగకుండా బండరాయితో తలపై మోది హతమార్చాడు. ఎవరి కంటా పడకుండా ఇంటికి చేరుకున్న మహేష్ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. ఇంటి నుంచి తాను వెళ్లిపోతున్నానని అన్నాడు.

అయితే తల్లిదండ్రులు.. కుమారుడు పరారవ్వకముందే జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి లొంగిపోయేలా చేశారు. హత్య జరిగిన చోటును పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి సందర్శించారు. అది పేట్‌బషీరాబాద్ స్టేషన్ పరిధి కావడంతో నిందితుడ్ని అక్కడ అప్పగించారు. సిఐ జానయ్య, ఎస్సై నదీమ్ హుస్సేన్ పాషా మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఒక్కడే చంపాడా ఎవరైనా కలిశారా అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు.

English summary
In a gruesome indident, three men allegedly murdered 
 
 their friend on Friday night by slitting his throat 
 
 and chopping off his testecles before abandoning his 
 
 body in an open field in the petbasheerabad area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X