రాష్ట్రపతికి పుస్తకాలిచ్చిన బాబు: సబిత గుండె దిటువు

తేడా ఉంది: సుధీర్ రెడ్డి
కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఆదేశాలను శిరసా వహిస్తానని సబితా ఇంద్రా రెడ్డి చెప్పారని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హైదరాబాదులో అన్నారు. కేంద్రమంత్రుల కేసుకు, రాష్ట్ర మంత్రుల కేసుకు చాలా తేడా ఉందని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
కార్యకర్తలా పని చేస్తా!: సబిత
తాను మంత్రిగా ఉండి కూడా పార్టీ కోసం కార్యకర్తలా పని చేశానని సబితా ఇంద్రా రెడ్డి తన వద్దకు వచ్చి సంఘీభావం తెలుపుతున్న నేతలు, సన్నిహితులతో చెబుతున్నట్లుగా తెలుస్తోంది. తాను ఇప్పటి వరకు పార్టీ కోసం కార్యకర్తలా పని చేశానని, ఇక ముందు కూడా అలాగే పని చేస్తానని చెప్పారు. కాంగ్రెసు బలోపేతానికి కృషి చేస్తానన్నారు. జగన్ కేసులో తాను బిజినెస్ రూల్స్ ఎక్కడా ఉల్లంఘించలేదన్నారు.
తనపై వచ్చిన ఆరోపణలను న్యాయపరంగా ఎదుర్కొంటానని ఆమె చెప్పారు. జీవితంలో తాను ఎన్నో గెలుపోటములు తాము చూశామని, ఇంద్రా రెడ్డి హయాం నుండే ఎన్నో పోరాటాలు చేశామని, భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేదని సబితా ఇంద్రా రెడ్డి తన వర్గానికి ధైర్యం నూరిపోస్తున్నారు. సబితా రెడ్డితో డిజిపి దినేష్ రెడ్డి కూడా భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications