నిర్దోషిగా నిరూపించుకుంటా, దాచలేదు: ధర్మాన వివరణ

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) వంటి దర్యాఫ్తు సంస్థలు అభియోగాలు మోపినంత మాత్రాన దోషులుగా తేల్చకూడదన్నారు. తమను నిత్యం కళంకిత మంత్రులు అనడంపై ధర్మాన ఆవేదన వ్యక్తం చేశారు. దర్యాఫ్తు సంస్థలు ఆరోపణలు చేసినంతనే దోషులు కాదని, కోర్టులో రుజువు కావాలన్నారు. కేబినేట్ ముందు కొన్ని విషయాలను దాచి పెట్టారనేది సిబిఐ వాదన అని కానీ, అది సరికాదన్నారు.
మంత్రివర్గం నిర్ణయం ద్వారానే వాన్‌పిక్ కేటాయింపులు జరిగాయన్నారు. కేబినెట్‌లో దాచిపెట్టారనే దానిలో వాస్తవం లేదన్నారు. మంత్రివర్గానికి తెలిసే నిర్ణయాలు అన్నీ జరిగాయని చెప్పారు. తాను చేసిన రాజీనామాకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని చెప్పారు. భూములు ఇవ్వాలా వద్దా అనే అంశాన్ని కేబినెట్లో పెట్టే నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకోగలరన్నారు. తన సొంతగా ఎవరికీ భూములు కట్టబెట్టలేదని, ఎక్కడా సంతకం పెట్టలేదన్నారు.
సిబిఐ సాంకేతిక అంశాలను లేవనెత్తిందని, తాను ఆరోపణల నుండి బయట పడగలనని భావిస్తున్నానని, కోర్టులపై తనకు నమ్మకముందని ఆయన చెప్పారు. ప్రభుత్వ శాఖలు భూములు కావాలంటే రెవెన్యూ శాఖనే కోరుతాయన్నారు. భూములు ఎవరికివ్వాలనే విషయం ఐ అండ్ ఐ నిర్ణయించగలుగుతుందని, ఇదే విషయాన్ని తాను బ్రహ్మానంద రెడ్డికి చెప్పానన్నారు. తన విషయంలో క్విడ్ ప్రోకో అంశాన్ని సిబిఐ లేవనెత్తలేదన్నారు. సాంకేతిక అంశాలే లేవనెత్తిందన్నారు.
ప్రభుత్వ నోడల్ వ్యవస్థగా ఐ అండ్ ఐ పని చేస్తోందన్నారు. కొన్ని పార్టీలు తమపై దిగజారి మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. భూములను కట్టబెట్టే అధికారం రెవెన్యూ శాఖకు లేదన్నారు. న్యాయవ్యవస్థ పటిష్టంగా పని చేస్తుందని, తన నిర్దోషిత్వం బయటపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను గ్రామస్థాయి నుండి మంత్రిగా కాంగ్రెసు పార్టీలో ఎదిగానని అన్నారు. తాను కాంగ్రెసువాదిగానే ఉంటానని చెప్పారు.
తనను ఎలా వినియోగించుకుంటుందో పార్టీ ఇష్టమన్నారు. తాను పార్టీ అభివృద్ధి కోసమే పాటుపడుతానని చెప్పారు. సబితా ఇంద్రా రెడ్డి కూడా ఎలాంటి తప్పు చేయలేదన్నారు. గతంలో ఉన్న చట్టాల ప్రకారమే సబితా ఇంద్రా రెడ్డి నడుచుకున్నారని చెప్పారు. ధర్మానను రాజీనామాపై ప్రశ్నించగా.. గతేడాదే ఆగస్టులోనే చేశానని చెప్పారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications