బలయ్యామని ధర్మాన, సబిత: ఎమ్మెల్యే పదవికీ రిజైన్!

మరోవైపు ధర్మాన ఇప్పటికే మంత్రి పదవితో పాటు తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖలు ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవులకు రాజీనామా చేసిన ధర్మాన, సబితలను పలువురు మంత్రులు కలిసి పరామర్శించారు. మంత్రులు వట్టి వసంత్ కుమార్, ఏరాసు ప్రతాప్ రెడ్డిలు సోమవారం ఉదయం ధర్మానను కలిశారు.
ఈ సందర్భంగా వారితో ధర్మాన... తాము బలి పశువులమయ్యామని ఆవేదనగా చెప్పినట్లుగా తెలుస్తోంది. మంత్రివర్గం నిర్ణయాలను మాత్రమే తాను అమలు చేశానని, ఏ ఫైలు తన వద్ద ప్రారంభం కాలేదు, క్లోజ్ కాలేదని ఆయన చెప్పారని తెలుస్తోంది. మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ముఖ్యమంత్రికి ఇచ్చానని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. ధర్మాన ప్రసాద రావు ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు విశాఖ వెళ్లనున్నారు. సబితా ఇంద్రా రెడ్డి ఇంటికి వట్టి వసంత్ కుమార్ వచ్చి పరామర్శించారు.
మరోవైపు కళంకిత మంత్రులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళంకిత మంత్రులను తొలగించాలని డిమాండ్ చేశారు. కళంకిత మంత్రులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాపాడుతున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications