అంతా అతనే: చంద్రబాబుపై నిప్పులు చెరిగిన కడియం

అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు ఎందుకు వేయలేదో చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వాన్ని కూల్చే అవకాశాన్ని బాబు వినియోగించుకోకపోవడం సరికాదన్నారు. కాంగ్రెసును బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిచ్చిన ఆయన అవిశ్వాసం సమయంలో మాత్రం దానిని పాటించలేదన్నారు. చంద్రబాబు అండ చూసుకునే కాంగ్రెసు తెలంగాణను నాన్చుతుందన్నారు.
తెలుగుదేశంను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోను టిడిపికి విశ్వసనీయత లేకుండా పోయిందన్నారు. కళంకిత మంత్రులపై చంద్రబాబు హడావుడి అంతా ఓ నాటకం అన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగంగానే చంద్రబాబు కళంకిత మంత్రులను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. కేబినెట్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేయకుండా కొందర్ని మాత్రమే తొలగించాలని డిమాండ్ చేయడమేమిటన్నారు.
కాంగ్రెసు పార్టీ పాలించే అర్హతను కోల్పోయిందన్నారు. కాంగ్రెసు పార్టీ అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిందన్నారు. కాంగ్రెసు, టిడిపిలు కలిసి తెలంగాణను అడ్డుకున్నాయన్నారు. ఎఫ్‌డిఐ ఓటింగు సమయంలోని పార్లమెంటు సభ్యుల పైన చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రాష్ట్రపతిని కలుస్తున్న చంద్రబాబు వెంటనే తెలంగాణ ప్రకటించాలని కోరాలని వినోద్ కుమార్ అన్నారు.












Click it and Unblock the Notifications