జగన్ అత్యాశకు బలయ్యారు, కళంకితులు కాదు: ఆనం

వైయస్ జగన్మోహన్ రెడ్డి అత్యాశ వల్లనే మంత్రులు, ఏఐఎస్ అధికారులు జైళ్లకు వెళ్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మినీ మహానాడుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జివోలపై సంతకాలు చేసిన మంత్రులు తప్పనిసరిగా శిక్షను అనుభవించాల్సిందేనని చెప్పారు.
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డిని కలిశారు. తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించినట్లుగా సమాచారం.
ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను తొలగించాలని డిమాండ్ చేస్తూ టిడిపి ఇందిరాపార్కు వద్ద ఆందోళన చేపట్టింది. ఆందోళనలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ... 48 గంటల్లో మంత్రులను తొలగించకపోతే రాజభవన్, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications