Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సబిత, ధర్మాన ఇష్యూ: జగన్ నిలదీత, ఎవరేమన్నారు?

YS Jagan
హైదరాబాద్: ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డిల రాజీనామాల నేపథ్యంలో కాంగ్రెసు పార్టీకి చెందిన ముఖ్య నేతలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. ధర్మాన, సబితలను తప్పించాల్సిందేనని అధిష్టానం ఆదేశించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వారితో భేటీ అయ్యారు. అనంతరం వారు గతంలో తాము చేసిన రాజీనామాలకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.

ధర్మాన, సబితలు అభియోగాలు ఎదుర్కొని రాజీనామాకు సై అనడంతో మిగతా మంత్రులు, ఇతర నేతలు జగన్ పైన నిప్పులు చెరిగారు. దీనికంతటికీ కారణం జగన్ అవినీతే అన్నారు. జగన్ ధన దాహం, అధికార దాహం వల్లే ఇలా జరిగిందంటున్నారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, సి రామచంద్రయ్య, తోట నర్సింహం, ఇతర నేతలు నేరుగా జగన్ పై మండిపడ్డారు. దానం నాగేందర్ వంటి వారు పరోక్షంగా చురకలు అంటించారు.

జగన్ పార్టీ నేతలకు తోట నరసింహం హెచ్చరిక

జగన్ అధికార దాహానికి, ధన దాహానికి మంత్రులు బలి అవుతున్నారని తోట నరసింహం అన్నారు. సబిత, ధర్మానలు ఏ తప్పు చేయలేదన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు జగన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని లేదంటే వారికి కూడా ఏదో ఒకరోజు ఇదే గతి పట్టక తప్పదన్నారు. వచ్చేది రాజన్న రాజ్యం కాదని జగనన్న జైలే అన్నారు. ఆ పరిస్థితి వస్తే చంచల్‌గూడతో పాటు జైళ్లన్ని నిండిపోతాయన్నారు. మంత్రులు బలవ్వడానికి కారణమెవరో విజయమ్మ చెప్పాలని ప్రశ్నించారు.

జగన్ అప్రూవర్‌గా మారి అందర్నీ రక్షించాలి: రామచంద్రయ్య

వైయస్ జగన్మోహన్ రెడ్డి అప్రూవర్‌గా మారి మంత్రులు, అధికారులను రక్షించాలని సి.రామచంద్రయ్య అన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే మంత్రులు రాజీనామా చేస్తున్నారన్నారు. జగన్ ధన దాహమే దీనికంతటికీ కారణమన్నారు. రాజీనామా చేసిన మంత్రుల పట్ల సానుభూతి ఉందన్నారు.

మొసలి కన్నీరు: ఆనం రామనారాయణ రెడ్డి

జగన్ ధన దాహానికి ధర్మాన, సబితాలు బలయ్యారని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. సబితా, ధర్మానలు కళంకితులు కారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, జగన్ సతీమణి భారతిలు మొసలి కారుస్తూ జగన్‌ను వెనుకేసుకొస్తున్నారని మండిపడ్డారు.

జగన్ వల్లే... మంత్రులు శిక్ష అనుభవించాల్సిందే: సోమిరెడ్డి

జగన్ అత్యాశ వల్లనే మంత్రులు, ఏఐఎస్ అధికారులు జైళ్లకు వెళ్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మినీ మహానాడుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జివోలపై సంతకాలు చేసిన మంత్రులు తప్పనిసరిగా శిక్షను అనుభవించాల్సిందేనని చెప్పారు.

ఎవరో చేసిన పనికి సబిత బలి: దానం

సబితా వంటి నేతల రాజీనామాలను ఆమోదిస్తే మంత్రివర్గ నిర్ణయాలకు విలువ లేకుండా పోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సబిత రాజీనామాను ఆమోదించిన పక్షంలో 26 జివోలతో సంబంధమున్న మిగతా మంత్రులందరు రాజీనామా చేయాల్సిందేనని అన్నారు. ఎవరో చేసిన దానికి ఆమెను బలి చేయడం సరికాదన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+