వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్య నగ్న చిత్రాలు గీసిన ఆర్టిస్ట్: ఫ్లాట్లో వేర్వేరు గదుల్లో

By Srinivas
|
Google Oneindia TeluguNews

Artist in trouble for painting wife
ముంబై: నగ్న చిత్రాలను గీయడం ప్రాథమికంగా నేరం కిందకే వస్తుందని ముంబై హైకోర్టు స్పష్టం చేసింది. విడిపోయిన తన భార్య నగ్న చిత్రాలను గీసిన ఓ చిత్రకారుడిపై క్రిమినల్ కేసును కొట్టివేయడానికి కోర్టు నిరాకరించింది. చిత్రకారుడైన చింతన్ ఉపాధ్యాయపై ఈ ఫిర్యాదు దాఖలైంది. వారి జంట 1998లో వివాహం చేసుకుంది. ఇద్దరు ముంబయిలో సంయుక్తంగా ఓ ఫ్లాట్ కొనుకున్నారు.

అనంతరం కొన్ని విభేదాలు తలెత్తడంతో ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇద్దరు అదే ఫ్లాట్‌లో వేర్వేరు గదుల్లో ఉంటున్నారు. చింతన్... తన నగ్న బొమ్మలు గీశారని ఆయన భార్య ఫిర్యాదు చేసింది. మహిళలను అసభ్యంగా చూపడాన్ని నిషేధించే చట్టం కింద కేసును నమోదు చేశారు. ఆమె ఫిర్యాదుపై కదిలిన బాంద్రా మెజిస్ట్రేట్... అందుకు అనుగుణంగా చర్యలను మొదలు పెట్టింది.

దీన్ని చింతన్... హైకోర్టులో సవాల్ చేశారు. మహిళలను అసభ్యంగా చూపడాన్ని నిషేధించే చట్టంలోని నిబంధనల కింద శిక్షార్హమైన ఏ నేరాన్ని ఫిర్యాదులో ప్రస్తావించలేదని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ పిటిషన్ పైన విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి ఈ వాదనతో విభేదించారు. తన ప్రయివేటు గదిలోనే పెయింటింగ్ వేశానన్న వాదన ఆధారంగా ఫిర్యాదును తిరస్కరించడం కుదరదని చెప్పారు.

పిటిషనర్ తరుచూ ఆ గదిని ఉపయోగించేవారు కాదని స్పష్టమవుతోందన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది అపరిమితమైనదని కాదని చెప్పారు. భార్య దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టేయలేమని చెప్పారు. ఆయితే ప్రస్తుత ఉత్తర్వులోని వ్యాఖ్యలు ప్రాథమికమైనవని, తాత్కాలికమైనవని తెలిపారు.

English summary
Observing that painting nude images prima facie amounted to an offence, the Bombay High Court has refused to quash a criminal complaint against an artist who painted nude and derogatory pictures of his estranged wife in his bedroom.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X