శ్రీశాంత్ చిన్న చేప, పెద్ద చేపలున్నాయి: కేరళ పోలీసులు

కోట్లాది రూపాయలు చేతులు మారిన బెట్టింగులో శ్రీశాంత్ చిన్న చేప మాత్రమే అయి ఉండవచ్చునని కేరళ పోలీసులు అంటున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ మరింత మంది పాత్ర వెలుగులోకి రావచ్చునని అంటున్నారు.
విస్తృతమైన దర్యాప్తు మాత్రమే వ్యవస్థ వెనక ఉన్న వాస్తవమైన నిర్వాహకులు బయటకు వస్తారని, ముగ్గురు ఐపియల్ ఆటగాళ్లను, కొంత మంది బుక్కీలను అరెస్టు చేయడానికి మాత్రమే ఢిల్లీ, ముంబై పోలీసుల దర్యాప్తు పరిమితం కాకూడదని అంటున్నారు
ముంబై, ఢిల్లీ పోలీసులు విచారణలో తేలిన అంశాల ఆధారంగా తాము దర్యాప్తు సాగించి, సమాచారం అందిస్తామని కొచ్చి రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ కె. పద్మకుమార్ అన్నారు. కేరళలో కూడా అటువంటి బెట్టింగులు జరిగి ఉండవచ్చునని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications