నిమ్మగడ్డ లింక్స్: కెసిఆర్‌పై సిబిఐ గడప తొక్కిన రఘు

తెరాస అగ్రనాయకత్వానికి సంబంధించిన అవతకవకలపై తాను జెడికి ఫిర్యాదు చేశానని, తన వద్ద ఉన్న ప్రాథమిక ఆధారాలను ఆయనకు అందించానని చెప్పారు. లీగల్ డిపార్టుమెంటుతో చర్చించి ఇంకా ఏమైనా ఇన్‌ఫర్మేషన్ అవసరమైతే తనను పిలిచి మాట్లాడుతానని చెప్పారన్నారు.
మరిన్ని సాక్ష్యాలు అవసరమైతే ఇస్తానని చెప్పారు. పార్టీ అక్రమ వసూళ్ల పైన తాను ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తెరాస అగ్రనాయకత్వంపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశానని చెప్పారు. స్టైలిష్ హోమ్స్ ఎండి తుమ్మల రంగారావుతో తెరాస ముఖ్య నేతలకు సంబంధాలు ఉన్నాయని రఘునందన రావు ఆరోపించారు.
దీనిపై పూర్తి విచారణ జరిపించాలని తాను కోరినట్లు చెప్పారు. కాగా సిబిఐకి అందజేసిన ప్రాథమిక ఆధారాల కాపీలను రఘునందన్ విలేకరులకు ఇచ్చారు. తెరాస అగ్ర నేతలు నిమ్మగడ్డ ప్రసాద్ నుండి రూ.10 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. న్యాయనిపుణులతో చర్చించి మళ్లీ పిలుస్తామని జెడి చెప్పారన్నారు. నిమ్మగడ్డ, కోనేరు రంగారావుల వ్యాపార లావాదేవీలను హరీష్, కెసిఆర్ నిర్వహించారని ఆరోపించారు. కస్టడీలో ఉన్న వారిని విచారిస్తే అన్నీ బయటపడతాయన్నారు.












Click it and Unblock the Notifications