వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు, జగన్‌లకు బొత్స కౌంటర్: గిఫ్ట్ ఇస్తామన్న దానం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: కాంగ్రెసు ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తుందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం అన్నారు. కాంగ్రెసు రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా బొత్స మాట్లాడారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నప్పటికి కొందరు కల్లిబొల్లి మాటలు చెబుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఉద్దేశించి అన్నారు.

కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల పైనే తమ ప్రధానమైన దృష్టి అని చెప్పారు. రెండు వారాలలో గ్రామస్థాయిలో పూర్తిస్థాయి కమిటీలని వేస్తామన్నారు. కొందరు అధికారంలోకి రావాలని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి అన్నారు. సలహాలు, సూచనలు స్వీకరించేందుకే ఈ సమావేశమని చెప్పారు. ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు మానుకోవాలన్నారు.

20 సీట్లు గెలిచి బహుమతిగా ఇస్తాం: దానం

నామినేటెడ్ పోస్టులను త్వరగా భర్తీ చేయాలని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ కోరారు. వచ్చే ఎన్నికలలో 20 సీట్లను గెలిచి బహుమతిగా ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికలలో అందరు కలిసి కట్టుగా పని చేయాలన్నారు.

జగన్ అవినీతి.. బాబు వైఫల్యాలు: విహెచ్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబ నాయుడు వైఫల్యాలను గ్రామస్థాయిలోకి తీసుకు వెళ్లాలని వి హనుమంత రావు అన్నారు. రాజీనామా చేసిన మంత్రులను అభినందించాలన్నారు. ఆరోపణలు ఉంటే రాజీనామా చేయించాలన్నదే అధిష్టానం అభిప్రాయమన్నారు. నామినేటెడ్ పోస్టులను త్వరలో భర్తీ చేయాలని లేదంటే నాయకులు ఇతర పార్టీల వైపు చూస్తారన్నారు. కాగా బొత్స కాంగ్రెసు పార్టీ వెబ్ సైటును ప్రారంభించారు.

English summary

 PCC chief Botsa Satyanarayana has blamed TDP chief Nara Chandrababu Naidu and YSR Congress Party chief YS Jaganmohan Reddy for their comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X