చంద్రబాబుతో భేటీ చిక్కులు: చీఫ్ విప్ గండ్ర వివరణ

ఇతర పార్టీల నాయకులతో సమావేశం కావాలంటే నాయకులు భయపడాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. వలసలు ఊపందుకున్న తరుణంలో ఈ భయాలు తప్పడం లేదు. ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలోకి వెళ్తారో తెలియని వాతావరణం ఉంది. ఈ స్థితిలో గండ్ర వెంకటరమణా రెడ్డి చంద్రబాబును కలిశారు.
ప్రభుత్వ చీఫ్ విప్‌గా కొనసాగుతూ ఉన్న గండ్ర వెంకటరమణారెడ్డి చంద్రబాబును కలవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన వివరణ ఇచ్చారు. తన కూతురు వివాహ శుభలేఖను ఇవ్వడానికి మాత్రమే తాను చంద్రబాబును కలిసినట్లు ఆయన తెలిపారు.
చంద్రబాబుతో రాజకీయాలు మాట్లాడలేదని, తన భేటీకి రాజకీయ కారణాలు ఏవీ లేవని ఆయన వివరించారు. చంద్రబాబు కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్న తరుణంలో కూడా వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం గండ్రకు ఏర్పడిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications