వైయస్ జగన్ పార్టీ మాకు సాటి రాదు: రేణుకా చౌదరి

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీకి ఉపయోగపడుతాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఉప ఎన్నికలకు, సాధారణ ఎన్నికలకు మద్య చాలా తేడా ఉంటుందని, సాధారణ ఎన్నికల్లోనే ఎవరి బలమేమిటో తెలుస్తుందని, ఉప ఎన్నికల్లో తెలియదని రేణుకా చౌదరి అన్నారు.
యుపిఎ పాలనలో ప్రవేశపెట్టిన సంస్కరణలు చూసి బిజెపి సహించలేకపోతోందని ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెసును విమర్శించడమే ధ్యేయంగా బిజెపి పార్లమెంటు సమావేశాలను అడ్డుకుందని ఆమె అన్నారు. తొమ్మిదేళ్ల యుపిఎ పాలనలో దేశం గణనీయమైన అభివృద్ధి సాధించిందని ఆయన అన్నారు.
భూసేకరణ, ఆహార బిల్లులను బిజెపి అడ్డుకుంటోందని ఆమె విమర్శించారు. యుపిఎ మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొడుతుందని ఆమె అన్నారు. ప్రజా సంక్షేమం కోసం తేవాలని తలపెట్టిన బిల్లులను బిజెపి అడ్డుకుంటోందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications