క్లియర్: కాంగ్రెసులోకే, ప్రధాని విందుకు జయప్రద

రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని, రాజమండ్రి నుంచి పార్లమెంటుకు పోటీ చేస్తానని జయప్రద చాలా రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే, ఆమె ఏ పార్టీలో చేరుతారనే విషయం మాత్రం ఇప్పటి వరకు తేలలేదు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడానికి ఆమె సిద్ధపడినట్లు కూడా వార్తలు వచ్చాయి. రాజమండ్రి సీటు కావాలనే ఆమె విజ్ఞప్తికి వైయస్సార్ కాంగ్రెసు నాయకత్వం హామీ ఇవ్వలేదని తెలిసింది.
జయప్రద ఆ మధ్య కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. సోనియాతో ఆమె భేటీ అత్యంత రహస్యంగా సాగింది. దాంతో జయప్రద కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధపడినట్లు భావించారు. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రస్తుతం కాంగ్రెసు పార్టీకే చెందిన ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాంతో ఆమె చేరిక అంత సులభం కాదని భావించారు.
జయప్రద కాంగ్రెసులోకి వస్తే తాను సహకరిస్తానని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. ఉండవల్లి అరుణ్ కుమార్‌ను రాజ్యసభకు నామినేట్ చేసి, జయప్రదకు రాజమండ్రి సీటు ఇవ్వడానికి కాంగ్రెసు అధిష్టానం సిద్ధపడినట్లు చెబుతున్నారు. జయప్రద అనకాపల్లి సీటు నుంచి పోటీ చేసే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు.












Click it and Unblock the Notifications