వైయస్‌ను వదిలేసిన కాంగ్రెస్, పట్టించుకోని క్యాడర్

YS Rajasekhar Reddy
హైదరాబాద్: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి కాంగ్రెసు పార్టీ నీళ్లు వదిలేసిందా? అంటే అవుననే చెప్పవచ్చు. కాంగ్రెసు పార్టీ కార్యక్రమాలలో వైయస్ ఫోటో లేకున్నా, వైయస్ ప్రస్తావన లేకున్నా ఆయన అభిమానులు నిరసన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. సాక్ష్యాత్తూ ముఖ్య నేతలు కూడా దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన రోజులు ఉన్నాయి. అయితే బుధవారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో వైయస్ ఊసేలేదు.

కార్యక్రమంలో వైయస్ రాజశేఖర రెడ్డి ఫోటో కనిపించలేదు. అంతేకాదు ఆ నేత పేరును కూడా ఎవరు ఎత్తలేదు! ఈ భేటీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణలు మాట్లాడారు. వారు ఎక్కడా వైయస్ పేరును పలకలేదు.

ముఖ్యమంత్రి తన ప్రసంగంలో వైయస్ పేరును చెప్పకుండా నాటి ముఖ్యమంత్రి అని చెప్పారు. బొత్స కూడా ఆ పేరును ఉచ్చరించలేదు. ఆనం రామనారాయణ రెడ్డి వైయస్ పేరును ఉచ్చరించినా.. ఆయన పేరును బజారుకీడుస్తారా అని మాత్రమే ప్రశ్నించారు. వైయస్ ప్రస్తావన లేకుండా గత సమావేశాలు గందరగోళమయ్యేవి. ఇప్పుడు మాత్రం సాఫీగానే సాగిపోవడం గమనార్హం.

ఈ సమావేశంలో నాయకులు ప్రధానంగా వైయస్సార్ కాంగ్రసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని, ఆయనకు చెందిన సాక్షి మీడియాను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీన్నిబట్టి వైయస్సార్ కాంగ్రెసుపై దూకుడు పెంచాలని కాంగ్రెసు పార్టీ నాయకులు అనుకంటున్నట్లు భావిస్తున్నారు. కాంగ్రెసు పట్టణ, మండల, బ్లాక్, డివిజన్ స్థాయి అధ్యక్షుల రాష్ట్ర స్థాయి సదస్సులో ముఖ్య నాయకులంతా జగన్‌ను, ఆయన పార్టీని నిందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+