జగన్‌పై సానుభూతి అందుకే, టిడిపి నయం: శంకరన్న

పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికలలో కాంగ్రెసు పార్టీకి ఇరవై సీట్లు వచ్చినా అదృష్టమే అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు, ఎంపీలకు మధ్య ఎక్కడా సమన్వయం లేదన్నారు. నిజమైన కార్యకర్తలకు పదవులు ఇస్తేనే కాంగ్రెసు వచ్చేసారి గట్టెక్కుతుందని చెప్పారు.
ఏ హస్తమో తెలుస్తుంది: శ్రీధర్ బాబు
ప్రతిపక్షాలు రాజకీయ దురుద్దేశ్యంతోనే అమ్మ హస్తం పథకం పైన దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. అమ్మ హస్తమో మాయా హస్తమో ప్రజలు తేల్చుతారన్నారు. కొన్ని పొరపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుంటామని చెప్పారు. నాణ్యతాలోపాలను సరిదిద్దేందుకు క్వాలిటీ కంట్రోల్‌ను పటిష్టం చేస్తామన్నారు.
అమ్మ హస్తం పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమిస్తామని చెప్పారు. అమ్మహస్తం సరుకుల ప్యాకెట్లను చింపి ఏవేవో పెట్టి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రేషన్ డీలర్లు వేరే పార్టీ వారు ఉంటే ఇలాంటి పనులు చేసి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications