ఎలా కొన్నారు: కిరణ్, బొత్సలకు జగన్ పార్టీ నేత ప్రశ్న

వైయస్ రాజశేఖర రెడ్డి రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తూ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వందశాతం ఎల్లో మీడియా చంద్రబాబు భజన చేస్తోందని, వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకే సాక్షి పత్రిక పుట్టిందని తెలిపారు. 4 ఏళ్లలో సీఎం, బొత్సలకు వార్తా చానళ్లు కొనేంత డబ్బులు ఎలా వచ్చాయని బాబు ఎందుకు అడగడంలేదని ప్రశ్నించారు.
తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను ఆర్థిక ఉగ్రవాది అన్న మంత్రి ఆనమే మానసిక ఉన్మాది అని గట్టు దుయ్యబట్టారు. వైఎస్ హయాంలో ఆనం సోదరులు పిల్లుల్లాగా తిరిగారని గుర్తు చేశారు. సీఎం మారితే పదవి కోసం కిరణ్‌ను అంతకన్నా హీనంగా తిట్టగల ఆనం రామనారాయణరెడ్డిది నాలుక కాదు తాటిమట్ట అన్నారు.
ఎన్డీఏ మీద ఒత్తిడి పెంచి రూ.500, రూ.1000 నోట్లను తెచ్చిందే చంద్రబాబు అని గుర్తు చేశారు. స్టాంపు కుంభకోణం, దొంగనోట్ల ముద్రణలో టీడీపీ వారే అరెస్టయ్యారని అన్నారు. ఎన్నికల సమయంలో కోట్లాది రూపాయలు టీడీపీ నేతల నుంచే రికవరీ అయ్యాయని అన్నారు.
అలాంటి చంద్రబాబు రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయాలంటే జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న బాబు, లోకేష్, ఆనం నాలుక కోయాలన్న కోపంలో ప్రజలున్నారని గట్టు రామచంద్రరావు చెప్పారు.


Click it and Unblock the Notifications