పెళ్లికి ముందు వరుడు పరారీ: అభయ ఎండి అరెస్ట్!

Groom
హైదరాబాద్/మెదక్: తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారనే కారణంతో ఓ పెళ్లి కొడుకు పరారయ్యాడు. మెదక్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. జిల్లాలోని దుబ్బాకలో ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లి కొడుకు పరారయ్యాడు. పెళ్లి ఇష్టం లేక పోవడం వల్లనే అతను పరారయ్యాడని తెలుస్తోంది.

దీంతో బంధువులు, పెళ్లి కూతురు తరఫు వారు ఆందోళన చెందారు. పెళ్లి కొడుకు కోసం గాలించారు. వీరి వివాహం ఆరు నెలల క్రితం నిశ్చయమైంది. వివాహం నిశ్చయమై ఇన్నాళ్లు గడిచినా పెళ్లికి ముందు అతను పారిపోవడం గమనార్హం. వధువు బంధువులు ఈ విషయమై దుబ్బాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

పెళ్లి కూతురు దుర్మరణం

ఖమ్మం జిల్లా అశ్వారావుపేట వధువు సహా ఐదుగురు దుర్మరణం చెందారు లారీ ఢీకొని వధువుతో పాటు ఐదుగురు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఉదయం పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి కూతురు తండ్రే లారీ నడిపి ప్రమాదానికి కారణమయ్యాడు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

పోలీసుల అదుపులో అభయ గోల్డ్ ఎండి

అభయ గోల్డ్ ఎండి శ్రీనివాస రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదులో అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విజయవాడకు తరలించి రహస్యంగా విచారణ జరుపుతున్నట్లుగా సమాచారం. వసూలు చేసిన డబ్బు తిరిగి చెల్లించడం లేదని బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అధిక వడ్డీ చెల్లిస్తామని చెప్పి ఖాతాదారుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు వారు ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+