సర్వే తారుమారు: జగన్, కెసిఆర్‌కు నరేంద్ర మోడీ ఎఫెక్ట్

వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీ రాష్ట్రంలో ప్రచారం నిర్వహిస్తే మాత్రం ఇది తారుమారు అయ్యే అవకాశాలు ఉన్నాయని మరికొన్ని సర్వేలు చెబుతున్నాయట. బిజెపి తెలంగాణకు అనుకూలంగా ఉండటం, మోడీకి ఉన్న ఆదరణే ఇందుకు కారణాలంటున్నారు. 2014 ఎన్నికల్లో మోడీని ప్రధాని అభ్యర్థిగా ఎన్డీయే ప్రకటిస్తేనే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. బిజెపి తెలంగాణకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో మోడీచే తెలంగాణ ప్రాంతంలో ప్రచారం చేయించాలని ఆ పార్టీ భావిస్తోంది.
మోడీ తెలంగాణ ప్రాంతంతో పాటు సీమాంధ్రలో ప్రచారం చేస్తే.. లోకసభ స్థానాలు అటు ఇటు అవుతాయని చెబుతున్నారు. ప్రస్తుత సర్వే ప్రకారం టిఆర్ఎస్‌కు 12, వైయస్సార్ కాంగ్రెస్‌కు 11, టిడిపికి 10, బిజెపి, మజ్లిస్‌లకు ఒక్కొక్కటి వస్తాయి. మోడీ ప్రచారం చేస్తే జగన్ పార్టీకి, తెరాసకు కోత పడి టిడిపి లబ్ధి చెందే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెబుతున్నాయట.
ఇప్పుడు ఒక స్థానం వస్తుందనుకుంటున్న బిజెపికి మోడీ ప్రచారం చేస్తే నాలుగు నుండి ఐదు వరకు వచ్చే అవకాశాలున్నాయట. ఇక సీమాంధ్రలో బిజెపి గెలువకున్నా జగన్ ఓట్లను చీల్చడం ద్వారా టిడిపికి లబ్ధి చేకూరుతుందట. అప్పుడు బిజెపికి నాలుగు నుండి ఐదు, తెరాస, జగన్ పార్టీలకు ఐదు నుండి ఎనిమిది, టిడిపికి పద్నాలుగు లేదా పదిహేను వస్తాయని తేలిందట. అయితే మోడీకి అంత సీన్ లేదని, ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికలలో ఆయన ఇమేజ్ ఏమాత్రం ఉపయోగపడలేదని మరికొందరు గుర్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications