అక్రమాలకు పాల్పడలేదు: ఫెమా ఉల్లంఘనపై పార్థసారథి

రిజర్వ్ బ్యాంక్ నిబంధనల మేరకు ఆంధ్రా బ్యాంక్ ఖాతా నుంచి అడ్వాన్స్ మొత్తం 60 లక్షల రూపాయలు స్విస్ కంపెనీకి పంపించామని, ఆరు నెలల తర్వాత మిగతా మొత్తాన్ని ఆంధ్రా బ్యాంక్ చెల్లించాల్సి ఉందని, అయితే అందుకు బ్యాంక్ నిరాకరించిందని ఆయన చెప్పారు. సమయానికి డబ్బు చెల్లించనందు వల్లనే ముందు చెల్లించిన సొమ్మును స్విస్ కంపెనీ జప్పు చేసుకుందని మంత్రి చెప్పారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా ఎక్కడా తప్పు పట్టలేదని చెప్పారు. విదేశీ కరెన్సీని తాము ఇతర ప్రయోజనాలకు వాడలేదని స్పష్టం చేశారు. స్విస్ కంపెనీతో ఒప్పందం పారదర్శకంగానే జరిగిందని పార్థసారథి చెప్పారు. ముఖేష్ అనే వ్యక్తితో తమకు ఏ విధమైన సంబంధం లేదని ఆయన అన్నారు. ట్రిబ్యునల్‌లో కేసు విచారణ విషయంలో తమ న్యాయవాది సమాచార లోపం వల్ల సరిగా వ్యవహరించలేదని ఆయన చెప్పారు.
ఫెమా ఉల్లంఘన కేసులో నాంపల్లి ఆర్థిక నేరాల కోర్టు ఆయనకు రెండు నెలల జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధించింది. నాంపల్లి ఆర్థిక నేరాల కోర్టు ఆదేశాలను పార్థసారథి హైకోర్టులో సవాల్ చేశారు. విచారణ అనంతరం హైకోర్టు శుక్రవారం స్టే విధించింది. ఫెమా ఉల్లంఘన కేసు పూర్తయ్యేంత వరకు దీనిపై స్టే కొనసాగుతుందని తెలిపింది.












Click it and Unblock the Notifications