జయప్రదకి చెక్: రాజమండ్రి బరిలో అలీ? జగన్Xటిడిపి

Jayaprada and Ali
హైదరాబాద్: ప్రముఖ కమెడియన్ అలీకి రాజకీయ డిమాండ్ పెరిగినట్లుగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలలో ఆయనను రాజమండ్రి బరిలో దించేందుకు ఇటు వైయస్సార్ కాంగ్రెసు అటు తెలుగుదేశం పార్టీలో పోటీ పోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయట. రాజమండ్రి పార్లమెంటు సభ్యుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పటికే మురళీ మోహన్ ఖరారయ్యారు.

కాంగ్రెసు పార్టీ నుండి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయన ఒప్పుకుంటే జయప్రద బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి కూడా ఇద్దరు ముగ్గురు పోటీలో ఉన్నారు. జయప్రద రాజమండ్రి ప్రాంతానికి చెందిన వ్యక్తి. అలీ కూడా ఇదే ప్రాంతానికి చెందినవాడు. అలీని తమ పార్టీ నుండి ఎన్నికల బరిలోకి దిగితే తమకు పార్లమెంటు స్థాయిలో లాభిస్తుందని వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు భావిస్తున్నాయట.

మురళీ మోహన్ ఇప్పటికే అలీతోని మాట్లాడినట్లుగా సమాచారం. అయితే ఆయన ఒప్పుకున్నారా లేదా అనే విషయం మాత్రం తెలియదు. అలీని రాజమండ్రి రూరల్ ప్రాంతం నుండి బరిలోకి దింపాలని టిడిపి భావిస్తోందట. అలీ పైన వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల కన్ను పడటానికి పలు కారణాలు ఉన్నాయి. ఆయన కొన్ని ఏళ్లుగా తాను పుట్టిన ప్రాంతంలో పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు.

దీంతో అతనికి అక్కడ మంచి పేరు ఉంది. అలీ కోసం ఆ రెండు పార్టీలు ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తున్నాయట. అయితే మురళీ మోహన్‌తో ఉన్న చనువు నేపథ్యంలో ఆయన పోటీ చేస్తే టిడిపి నుండి పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అలీ ద్వారా జయప్రదకు చెక్ చెప్పవచ్చని ఆ పార్టీలు గట్టిగా భావిస్తున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+