కేంద్రమంత్రి, ఎంపి రాజయ్యకు నాన్‌బెయిలబుల్ వారెంట్

గతేడాది స్టేషన్ ఘనపూర్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే రాజయ్య రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. ఈ ఉప ఎన్నికల సమయంలో రాజయ్య, బలరామ్ నాయక్‌లు స్థానికంగా ఓ ప్రార్థనా మందిరంలో కాంగ్రెసు కండువాతో వెళ్లి ప్రార్థనలు చేశారు. అనంతరం బయట బహిరంగ సభలో మాట్లాడారు.
కడియంపై ఎర్రబెల్లి ఫైర్
తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన కడియం శ్రీహరి పదవి కోసమే తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారని టిటిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. బుధవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణపై టిడిపి స్పష్టతతో ఉందని కడియం హోంశాఖకి లేఖ ఇవ్వడం వాస్తవమా కాదా అని ప్రశ్నించారు.
కడియం తెలంగాణవాదులను ఫూల్స్‌ని చేశారని ఎర్రబెల్లి మండిపడ్డారు. తాను ఎట్టి పరిస్థితుల్లోను పార్టీ మారేది లేదని చెప్పారు. వచ్చే ఎన్నికలలో తాను టిడిపి తరఫున పాలకుర్తి నుండి పోటీ చేసి మంత్రిని అవుతానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టిడిపి గెలుపును ఎవరు ఆపలేరన్నారు.












Click it and Unblock the Notifications