చెన్నై సిఈఓకు సమన్లు: లోకులు కాకులు.. సాక్షి ధోనీ

తాజా సమాచారం మేరకు... గురునాథ్ ఇంట్లో లేకపోవడంతో పోలీసులు సమన్స్ కాపీని ఆయన ఇంటికి అతికించారు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో ప్రశ్నించాల్సి ఉందని, ముంబయికి రావాల్సిందిగా పోలీసులు అందులో ఆదేశించారు. టివిలో వస్తున్న వార్తల ప్రకారం.... చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ఈ రోజు పోలీసులను కలువనుంది. గురునాథ్ శుక్రవారం వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అంతకుముందు గురునాథ్ ఇంటికి వెళ్లిన పోలీసులు పది నిమిషాలు బయట నిలబడ్డారు. ఆ తర్వాత లోనికి వెళ్లారు.
రాజస్థాన్ మ్యాచ్‌ల వీడియోలివ్వండి
రాజస్థాన్ రాయల్స్ జట్టులోని ముగ్గురు బౌలర్లు స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టైన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై కూపీ లాగుతున్నారు. రాజస్థాన్ రాయల్స్ ఆడిన మ్యాచ్‌ల వీడియోలు కావాలని సెట్ మాక్స్‌ను అధికారులు ఆదేశించారు. మరోవైపు హైదరాబాదులోకు వచ్చిన ఢిల్లీ పోలీసు ప్రత్యేక బృందం హోటళ్లలో, ఉప్పల్ స్టేడియంలో సోదాలు నిర్వహిస్తోంది.
ట్విట్టర్‌లో ధోనీ భార్య స్పందన
స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో విందూ దారా సింగ్ అరెస్టు అనంతరం ఆయన కంటే చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఓ మ్యాచ్‌లో సాక్షి ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టైన విందూతో కలిసి ఉన్నారు. దీంతో సాక్షి పేరు ప్రధానంగా వార్తల్లో నిలిచింది.
దీనిపై ఆమె ట్విట్టర్‌లో స్పందించారు. విందూతో తనకు ఎలాంటి సంబంధం లేదని, మ్యాచ్ సందర్భంగా అతనిని పిలిచి పక్కన కూర్చోమన్నది తనేనని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె హిందీ సాంగ్ లవర్స్ కోసం అంటూ... 'కుచ్ తో లోగో కహేంగే, లోగో కా నామ్ హై కహ్‌నా' అని ట్వీట్ చేశారు. అంటే లోకులు కాకులు అని.. ఏదో ఒకటి అనడం వారి నైజం అని అర్థం వచ్చే రీతిలో ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications