ఇక సై అంటే సై: జగన్ 'స్కీమ్స్'కు కాంగ్రెస్ 'ఆనం' అస్త్రం

అందులో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.. జగన్ పైన చేసిన ఘాటైన వ్యాఖ్యలను అస్త్రంగా వాడుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. వచ్చే స్థానికంలో ఆనం చేసిన ఆర్థిక ఉగ్రవాదిని తరిమికొడదాం అనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లాలని కాంగ్రెసు యోచిస్తోంది. తద్వారా తమ సంప్రదాయ ఓటు బ్యాంకును తిరిగి సమీకరించే ప్రయత్నాలు చేయాలని భావిస్తోంది.
ఆనం పలుమార్లు జగన్‌ను ఆర్థిక ఉగ్రవాది అంటూ ఘాటైన విమర్శలు చేశారు. ఈ ప్రచారాన్ని పోలింగు బూత్‌ల స్థాయి వరకు తీసుకు వెళ్లాలని చూస్తున్నారట. బుధవారం జరిగిన సదస్సులోను నేతలకు అందజేసిన కరపత్రంలో ఆర్థిక నేరస్థుల చేతుల్లోకి అధికారం వెళ్తే రాష్ట్రం అంధకారమే అనే పేరుతో జగన్ అక్రమాస్తల కేసులో బెయిల్ పైన విచారణ సందర్భంగా ప్రస్తావనకు వచ్చిన అంశాలని కాంగ్రెసు ప్రస్తావించింది.
కర్నాటకలో భారతీయ జనతా పార్టీ ఓటమికి కారణాలు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై విమర్శలను కూడా కరపత్రంలో ప్రస్తావించారు. అయితే జగన్ అక్రమాస్తుల పైనే ఎక్కువగా దృష్టి పెట్టాలని భావిస్తోందట. అదే సమయంలో జగన్ బెయిల్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలపై కూడా దృష్టి సారించిందట. ఆర్థిక నేరాలు హత్యల కంటే తీవ్రమైనవి సుప్రీం వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
కాగా పథకాలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై షర్మిల స్పందిస్తూ... పథకాలు ముమ్మాటికి తమవేనని చెప్పిన విషయం తెలిసిందే. స్థానిక ఎన్నికల ముందు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పథకాలపై అధికార పార్టీ జగన్ అవినీతిపై సై అంటే సై అనుకుంటున్నాయి.












Click it and Unblock the Notifications