ఇంకెన్నిసార్లు చెప్పాలి, వసూళ్ల పార్టీ: కెసిఆర్‌కు బాబు

ఈ సందర్భంగా బాబు మాట్లాడారు. 'అధికారంలో ఉన్నప్పుడు నీతి నిజాయతీలతో పని చేసిన పార్టీ టిడిపి. వెనుకబడిన తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధికి పునాదులు వేసింది టిడిపి. టిడిపి హయాంలో తెలంగాణలో 18 లక్షల ఎకరాలకు నీరిచ్చాం. గిరిజన ప్రాంతాల్లో ఆస్పత్రు లు, అంబులెన్సులు, వేలమంది పారా మెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేశాం. తెలంగాణను ఎవరు అభివృద్ది చేశారో బహిరంగ చర్చకు రావాలని మేం సవాల్ విసిరితే ముందుకు రావడానికి ఏ ఒక్క పార్టీకి సాహసం చాలడం లేదు..' అని ఆయన పేర్కొన్నారు.
తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం నాశనమైందని, రోజుకు కేవలం మూడు గంటల విద్యుత్ మాత్రమే సరఫరా అయ్యే దుస్థితిని ఆ పార్టీ తెచ్చి పెట్టిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అడ్డగోలుగా దోచుకుంటూ సామాన్యులను విస్మరిస్తోందన్నారు. తెలంగాణ అంశంలో తెరాస పార్టీ దుష్ప్రచారం తిప్పికొట్టాలని ఆయన పార్టీ నేతలను కోరారు.
'తెలంగాణకు అనుకూలంగా టీడీపీ 2008లోనే లేఖ ఇచ్చింది. అఖిలపక్షం పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. అఖిలపక్షంలో పాత లేఖకే కట్టుబడి ఉన్నామని మరో లేఖ ఇచ్చాం. మా వైఖరి ఇంత స్పష్టంగా ఉన్నా టీఆర్ఎస్ కేవలం రాజకీయ కక్షతో దుష్ప్రచారం చేస్తోంది' అని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications