బాబుకు కెసిఆర్ సవాల్: రాజకీయ పోరాటం ద్వారానే

తెలంగాణ వస్తే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని, తండాలను పంచాయతీలుగా మార్చుతామని, నిజామాబాద్‌కు సింగూరు జలాలు తీసుకు వస్తామని, పోలీసులకు సామాజిక బాధ్యత కల్పిస్తామని, రైతులకు లక్ష వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని, పగటి పూట 8 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని, నిర్బంధ విద్య అమలు చేస్తామని చెప్పారు.
పోరాడితేనే తెలంగాణ: పోచారం
తెలంగాణ ప్రజలు పోరాడితేనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో అన్నారు. పార్టీ శిక్షణా తరగతుల ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలు పోరాడి తెలంగాణను సాధించుకోవాలన్నారు. కెసిఆర్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలమని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీతో టిడిపి కుమ్మక్కైందని ఆరోపించారు.
సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతాన్ని సీమాంధ్రులు అన్ని రకాలుగా దోచుకున్నారని ఆరోపించారు. సీమాంధ్ర పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉంటే తెలంగాణ కోసం పోరాటం చేయలేమన్నారు. అందుకే తాను ఆ పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరానని అన్నారు. తాను తెలంగాణ కోసమే తెరాసలో చేరానని, పదవుల కోసం మాత్రం కాదన్నారు.
తెరాసలోకి కాంగ్రెసు ఎంపీలు!
తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెసు ఎంపీలు మందా జగన్నాథం, వివేక్, రాజయ్య, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు వచ్చే నెల మొదటి వారంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణపై ఈ నెలాఖరులోగా కేంద్రం నిర్ణయం తీసుకోకుంటే తాము తమ భవిష్యత్తును చూసుకుంటామని రాజయ్య ఈ రోజు అన్నారు.












Click it and Unblock the Notifications