• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పురంధేశ్వరికి సోనియా షాకిస్తారా?: టిఎస్సార్‌కు సిగ్నల్స్

By Srinivas
|

Sonia Gandhi - Purandeswari
న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికలలో విశాఖ సీటు తనదేనని రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామి రెడ్డి మరోసారి చెప్పారు. ఆయన గురువారం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడుతూ విశాఖ సీటు తనకే ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, అంతిమంగా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. ఆయన మాటలను బట్టి చూస్తుంటే వచ్చేసారి కేంద్రమంత్రి పురంధేశ్వరికి సోనియా షాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

పురందేశ్వరిపై కొంతకాలంగా సుబ్బిరామి రెడ్డి చేస్తున్న రాజకీయ, మానసిక పోరులో ఆయనే నెగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. గత ఎన్నికల్లోనే తాను విశాఖ నుంచి లోక్‌సభకు పోటీ చేయాలనుకున్నానని, అయితే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నందువల్ల.. వచ్చేసారి తన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటానని అధిష్ఠానం చెప్పిన విషయాన్ని ఆయన సోనియాకు గుర్తు చేశారట.

ఆయన అభ్యర్థనను సోనియా వ్యతిరేకించకపోగా విశాఖలో మరిన్ని అభివృద్ధి, సేవా కార్యక్రమాలు అమలు చేసి పార్టీ పరిస్థితి మెరుగుపరచాలంటూ కోరడంతో సుబ్బిరామిరెడ్డికి సానుకూల సంకేతాలు లభించాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. 2009లో విశాఖ నుంచి తాత్కాలికంగా పురందేశ్వరి పోటీ చేస్తే బాగుంటుందని తానే సూచించి, గెలిపించేందుకు కృషి చేశానని ఆయన సోనియాకు చెప్పారు.

నిజానికి విశాఖ పట్టణంలో పురందేశ్వరికి ఏ మాత్రం సంబంధాలు లేవని, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఆమె ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే విజయం సాధించకపోవచ్చని ఆయన తెలిపారట. నరసరావుపేట నియోజకవర్గం నుంచి పురందేశ్వరి పోటీ చేయడం, ఆమెకు, పార్టీకి రాజకీయంగా మంచిదని దీనిపై దృష్టి సారించాలని మేడమ్‌కు సుబ్బిరామి రెడ్డి వివరించారట.

తాను 32 ఏళ్లుగా విశాఖకు సేవ చేస్తున్నానని, ఎన్నో సామాజిక, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నానని తెలిపారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ హోదాలో విశాఖను కాలుష్యం బారి నుంచి రక్షించేందుకు ఐదేళ్లలో 40 లక్షల మొక్కలు నాటాలన్న తన ప్రణాళికను సోనియా దృష్టికి తీసుకెళ్లారు. దళితులు, మైనారిటీలు, గిరిజనులు, మహిళలు, విద్యార్థులకు తాను అమలు చేస్తున్న కార్యక్రమాలను, విశాఖ అభివృద్ధిలో ఇతర పారిశ్రామిక సంస్థలకు భాగస్వామ్యం కల్పించి అమలు చేస్తున్న పథకాలను సోనియాకు వివరించారట.

ఈ వివరాలన్నీ విన్న ఆమె.. 'వెరీగుడ్. ఇలాగే చేయండి. గో ఎహెడ్..' అని తనను అభినందించారని, విశాఖలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారని సుబ్బిరామి రెడ్డి సూచించారట. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బాగా పని చేస్తున్నారని, ఆయన అమలు చేస్తున్న పథకాల వల్ల కాంగ్రెస్ పట్ల జనం పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారని, గత ఏడాదితో పోలిస్తే పార్టీ పరిస్థితి ఎంతో మెరుగైందని వివరించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Rajya Sabha member T. Subbarami Reddy who eagerly spent 15 minutes with AICC president Sonia Gandhi on Thursday, used the time to retail to her all the meritorious welfare schemes on which the party had embarked in the city, many of which he said he had initiated with money from his own pocket.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more