లుకలుకలు: మేకపాటి ఫిర్యాదు, కాకాని వర్గంపై వేటు

ఆయన ఫిర్యాదు మేరకు అధిష్టానం కాకాని వర్గీయలపై సస్పెన్షన్ వేటు వేసింది. సహకార ఎన్నికలలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కాకాని వర్గానికి చెందిన గంగినేని రంగారావు, శ్రీనివాస్ రెడ్డి, మానెపాటి వెంకటసుబ్బయ్య, చిరంజీవిలను పార్టీ నుండి సస్పెండ్ చేసింది.
కాగ, జిల్లాలో మేకపాటి రాజమోహన్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డిల మధ్య విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. జిల్లాలో తమ వర్గానికి ప్రాధాన్యత లభించడం లేదని మేకపాటి రాజమోహన్ రెడ్డి కొంతకాలం అధిష్టానం పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు ఆయనను బుజ్జగించారు. ఇప్పుడు కాకాని వర్గంపై వేటు వేయడం గమనార్హం.
బ్రాహ్మణిని సందర్శించిన వైయస్సార్ కాంగ్రెసు
కడప జిల్లాలోని బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు మేకపాటి చంద్రశేఖర రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి తదితరులు సందర్శించారు.












Click it and Unblock the Notifications