చర్చకు సిద్ధమా: వైయస్ జగన్ పార్టీకి గండ్ర సవాల్

Gandra Venkataramana Reddy
హైదరాబాద్: సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి సవాల్ విసిరారు. ఏ పథకం అమలు ఆగిందో నిరూపించడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు బహిరంగ చర్చకు సిద్ధపడుతారా అని ఆయన అడిగారు. కాంగ్రెసు పార్టీని వీడేవాళ్లు వచ్చే ఎన్నికల్లో గెలువరని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకే తమ పార్టీ తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు పార్టీ అధిష్టానానికి డెడ్‌లైన్లు పెడుతున్నారని ఆయన అన్నారు. వారు పార్టీని వీడుతారని అనుకోవడం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ఎవరు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించినా ఎదుర్కుంటామని ఆయన చెప్పారు. తమకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి మద్దతు అవసరం లేదని స్పష్టం చేశారు.

తమ పార్టీ అధిష్టానం పెద్దల భిన్నమైన ప్రకటనల వల్లనే పార్టీకి ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. నాయకుల వలసల వల్ల పార్టీల మధ్య ఐక్యత కోల్పోయి తెలంగాణ ఏర్పాటుకు విఘాతం ఏర్పడుతుందని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

ఈశాన్య రాష్ట్రాల్లో చలితీవ్రతకు ఇచ్చినట్లే మన రాష్ట్రంలో వడ దెబ్బ మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని ఆయన అన్నారు. వడదెబ్బతో మరణించిన వారి కుటుంబాలకు పది లక్షల రూపాయలేసి నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి పి. శంకరరావు కూడా డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+