పేపర్ల లీకేజీ మహా పాపం: మొదటిసారి పెదవి విప్పిన ప్రధాని మోదీ
నీట్ (NEET) పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘాటుగా స్పందించారు. ఈ వివాదాన్ని ఆయన తీవ్ర నేరంగా అభివర్ణించారు. క్షమించరాని మహా పాపంగా పేర్కొన్నారు. ఈ పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తక్షణమే తాము యుద్ధప్రాతిపదికన స్పందించామని, బాధ్యులైన వారిపై తగిన కఠిన చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళ్ మిలన్ ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ లీకేజీలో ప్రమేయం ఉన్న అసలు సూత్రధారులను గుర్తించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 13 మంది కీలక నిందితులను దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయని పేర్కొన్నారు. ఏ నీట్ పేపర్లు లీక్ అయ్యాయో.. అవే నీట్ పరీక్షలను మరోసారి విజయవంతంగా నిర్వహించామని, విద్యార్థులకు న్యాయం చేశామని ఆయన వ్యాఖ్యానించారు.

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళ్ మిలన్ ప్రధాని మోదీ మాట్లాడారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో బీజేపీ హైకమాండ్.. ఈ భేటీ నిర్వహించింది. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో ఇది ఏర్పాటైంది. అమిత్ షా, కిరణ్ రిజిజు, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, పీయూష్ గోయెల్.. ఇలా దాదాపుగా కేంద్రమంత్రులు, బీజేపీ లోక్ సభ, రాజ్యసభ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు.
ఈ లీకేజీలో ప్రమేయం ఉన్న అసలు సూత్రధారులను గుర్తించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 13 మంది కీలక నిందితులను దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయని పేర్కొన్నారు. ఏ నీట్ పేపర్లు లీక్ అయ్యాయో.. అవే నీట్ పరీక్షలను మరోసారి విజయవంతంగా నిర్వహించామని, విద్యార్థులకు న్యాయం చేశామని ఆయన వ్యాఖ్యానించారు.
భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకునే వారిని వదిలిపెట్టబోమని, ఈ కేసులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెడతామని, ఈ విషయంలో రాజీ పడబోమని తేల్చి చెప్పారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు భరోసా కల్పించడానికి తక్షణ ప్రాధాన్యత ఇస్తోన్నామని పేర్కొన్నారు.
ఈ వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విలేకరులకు వెల్లడించారు. నీట్ పరీక్షలో తలెత్తిన వివాదం, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ప్రధాని మోదీ ప్రసంగించినట్లు చెప్పారు. లక్షలాది మంది విద్యార్థుల విలువైన కాలాన్ని వృథా కాకుండా చూసేందుకు ప్రభుత్వం తీసుకున్న తదుపరి చర్యలను కూడా ప్రధాని వివరించారని రిజిజు చెప్పారు. నీట్ రీటెస్ట్ ను అత్యంత పారదర్శకంగా, విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు ఎలాంటి జాప్యం లేెకుండా ఫలితాలను విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications