గురునాథ్ సహకరించలేదు, దాటేశారు: పోలీసులు

ముంబై: బెట్టింగ్ వ్యవహారంలో అరెస్టయిన బిసిసిఐ చీఫ్ శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్ మేయప్పన్ విచారణకు సహకరించలేదని, ప్రశ్నలకు జవాబులు దాటేశారని పోలీసులు చెప్పారు. శుక్రవారం రాత్రి అరెస్టు చేసిన తర్వాత గురునాథ్‌ను కొన్ని గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. మధురై నుంచి ముంబైకి చేరుకోగానే పోలీసులు గురునాథ్‌ను క్రైం బ్రాంచ్ కేంద్ర కార్యాలయానికి తరలించారు. అర్థరాత్రి సమయంలో గురునాథ్‌ను అరెస్టు చేసినట్లు జాయింట్ పోలీసు కమిషనర్ హిమాంశు రాయ్ ప్రకటించారు.

గురునాథ్ మేయప్పన్‌ను హిమాంశ్ రాయ్ స్వయంగా రెండున్నర గంటల పాటు ప్రశ్నించారు. ఆ తర్వాత 35 ఏళ్ల గురునాథ్‌ను క్రైం బ్రాంచ్ బృందం ప్రశ్నించింది. అతను విచారణలో సహకరించలేదని, పలు ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారని పోలీసులు శనివారం చెప్పారు. గురునాథ్‌ను ముంబై కోర్టు ఈ నెల 29వ తేదీ వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Gurunath Meiyappan

గురునాథ్ మేయప్పన్‌ను పోలీసులు కోర్టు ముందు ప్రవేశపెట్టారు. విందూ తనకు తెలుసునని గురునాథ్ చెప్పినట్లు సమాచారం. విందూతో కలిపి గురునాథ్‌ను పోలీసులు విచారించినట్లు సమాచారం. గురునాథ్ కోసం తాను బెట్టింగ్‌కు దిగినట్లు విందూ దారాసింగ్ చెప్పిన విషయం తెలిసిందే. గురునాథ్ బెట్టింగులో కోటి రూపాయలు నష్టపోయినట్లు కూడా ఆయన చెప్పారు.

గురునాథ్ మేయప్పన్ కొడైకెనాల్ నుంచి మధురై చేరుకుని అక్కడి నుంచి విమానంలో ముంబైకి చేరుకున్నారు. ఆయన ముంబైకి శుక్రవారం రాత్రి చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న వెంటనే ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు గురునాథ్‌ను అదుపులోకి తీసుకున్నారు. గురునాథ్ అరెస్టు నేపథ్యంలో రాజీనామాకు బిసిసిఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్‌పై ఒత్తిడి పెరుగుతోంది.

అయితే తాను రాజీనామా చేయబోనని, తాను ఏ విధమైన తప్పూ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఆయన ముంబై చేరుకున్నారు. గురునాథ్ అరెస్టయిన తర్వాత శ్రీనివాసన్ మొదటి సారి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. భారీ ఐపియల్ కుంభకోణం నేపథ్యంలో శ్రీనివాసన్ రాజీనామా చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్నాథ్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+