కోపం తగ్గని హరికృష్ణ: పార్టీ కండువాకి నో, లేని ఫ్లెక్సీలు

మహానాడుకు వచ్చిన హరికృష్ణ మొదట వేదిక పైకి ఎక్కకుండా కిందనే ఓ పక్కన కుర్చీలో కూర్చున్నారు. వేదిక పైన పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, ఎర్రబెల్లి దయాకర రావు, దేవేందర్ గౌడ్ వంటి నేతలు ఉన్నారు. హరికృష్ణ మాత్రం కింద కుర్చీలో కూర్చుండి పోయారు. దీంతో హరికృష్ణకు కోపం తగ్గిందా? ఆయన ఏం మాట్లాడుతారు? ఆయన ఏం మాట్లాడితే మళ్లీ ఏ రకమైన చర్చ సాగుతుందో? అనే ఆందోళన టిడిపి వర్గాల్లో కనిపిస్తోంది.
కాసేపటికి వేదిక పైకి ఎక్కిన హరికృష్ణ పార్టీ కండువా కప్పబోతుంటే తిరస్కరించారు. కండువా కప్పుకోకుండానే వేదిక పైన కూర్చున్నారు. మహానాడులో చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్‌ల ఫ్లెక్సీలు కనిపించగా హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు మాత్రం ఎక్కువగా కనిపించలేదు.
చంద్రబాబు కూడా గండిపేటకు చేరుకున్నారు. చిత్తూరు జిల్లా సభ్యత్వ నమోదు కేంద్రంలో బాబు సంతకం చేశారు. కాగా, తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజును పురస్కరించుకొని టిడిపి ఈ నెల27, 28 తేదీల్లో మహానాడు వేడుకను గండిపేటలో నిర్వహిస్తోంది. నారా లోకేష్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆయన రాక అక్కడి టిడిపి నేతల్లో ఉత్సాహం నింపింది. ఆయనకు ఘన స్వాగతం పలికారు.
కెసిఆర్‌కు ఎర్రబెల్లి సవాల్
తెలంగాణపై తెలుగుదేశం పార్టీ మహానాడులో మరోసారి స్పష్టత ఇస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు సోమవారం అన్నారు. తెలంగాణపై చర్చకు తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు సిద్ధమా అని సవాల్ విసిరారు. చర్చకు తాను రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు వస్తారని, చర్చ ఎక్కడ, ఎప్పుడనేది, మధ్యవర్తులు ఎవరనేది తెరాస నేతలే చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications