వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ చేతిలో బాబుకు ఓటమే, పిసి కంటే ఇంద్రజాలికుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan - Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన కన్నా పెద్ద ఇంద్రజాలికుడని ప్రముఖ మెజీషియన్ పిసి సర్కారే కితాబిచ్చారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సోమవారం ఎద్దేవా చేసింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, బాలరాజు, ధర్మాన కృష్ణదాసులు మీడియాతో మాట్లాడారు.

బాబు తన కన్న పెద్ద ఇంద్రజాలికుడని గతంలో పిసి సర్కారే అన్నారన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాన్ని చంద్రబాబు నాయుడే నిర్ణయిస్తారన్నారు. గత ఎన్నికలలో మహాకూటమి ఓటమికి చంద్రబాబే కారణమన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతిలో బాబుకు ఓటమి తప్పదన్నారు. కిరణ్ ప్రభుత్వాన్ని టిడిపియే కాపాడుతోందని విమర్శించారు. కిరణ్, బాబు పాలనలు ఒకే విధంగా ఉన్నాయని, అందుకే కాపాడుతున్నట్లుగా ఉందన్నారు.

మహానాడు కాదని మాయా నాడు అన్నారు. టిడిపి లేదని చంద్రబాబు కాంగ్రెసుతో కుమ్మక్కైనందున ఇప్పుడు రాష్ట్రంలో తెలుగు కాంగ్రెసు మాత్రమే ఉందన్నారు. తెలుగు కాంగ్రెసుకు మహానాడు నిర్వహించే హక్కు లేదన్నారు. 2014లో మాయా కూటమి కోసం తెలుగు కాంగ్రెసులు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో తెలుగు కాంగ్రెసు పాలన నడుస్తోందనే భావన అందరిలోను ఉందన్నారు.

నిరసన కార్యక్రమాలు

జగన్ అరెస్టై ఏడాది పూర్తయినందున వైయస్సార్ కాంగ్రెసు నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద కొవ్వొత్తుల నిరసన చేపట్టనున్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పాల్గొంటారు. మంగళవారం ఇందిరా పార్కు వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షలో విజయమ్మ, భారతి పాల్గొంటారు.

English summary
YSR Congress Party MLAs said that Telugudesam Party chief Nara Chandrababu Naidu will defeat in next general elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X