వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరోపణలపై సబిత: తెలంగాణపై బాబుకు బిజెపి అండ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Bandaru Dattatreya and Sabitha Indra Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో సిబిఐ అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి తాను తన నిజాయితీని నిరూపించుకొని నిర్దోషిగా బయటపడతానని చెబుతున్నారు.

ఆమె సోమవారం రంగారెడ్డి జిల్లాలో ఓ దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తన నిజాయితీని నిరూపించుకుంటానని చెప్పారు. న్యాయస్థానంపై తనకు పూర్తిగా నమ్మకముందన్నారు. ఓ కార్యకర్తగా పార్టీ ప్రతిష్ట పెంచే దిశగా తాను పని చేస్తానని చెప్పారు.

దాడిని ఖండించిన ధర్మాన

ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెసు నేతలపై జరిగిన దాడి ఓ పార్టీ నేతలపై జరిగింది కాదని, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు శ్రీకాకుళం జిల్లాలో అన్నారు.

కోర్టుకు వ్యతిరేకంగా ఆందోళనా?: తులసి రెడ్డి

జగన్ కేసులో కాంగ్రెసుకు, కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తులసి రెడ్డి చెప్పారు. కోర్టులంటే జగన్ పార్టీకి ఏమాత్రం గౌరవం లేదన్నారు. రాజ్యాంగం అంటే లెక్క లేదన్నారు. జగన్ అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ ఆందోళనలు చేయడం విడ్డూరమన్నారు. వారి ఆందోళనలు హైకోర్టు, సుప్రీం కోర్టుకు వ్యతిరేకంగానా అని ప్రశ్నించారు.

చంద్రబాబు తెలంగాణను అడ్డుకోలేదు: దత్తాత్రేయ

ఎన్డీయే హయాంలో తెలంగాణను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అడ్డుకోలేదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఢిల్లీలో అన్నారు. అయితే చంద్రబాబు బిజెపిపై అనవసర విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. జూన్ 3వ తేదిన నిజాం కళశాలలో బిజెపి బహిరంగ సభ జరుగుతుందని, అందులో జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ పాల్గొంటారన్నారు.

రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు, తెరాసలు బలహీనపడుతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపికి పాజిటివ్ ఓటింగ్ పడుతుందన్నారు. నాగం జనార్ధన్ రెడ్డి తెలంగాణ నగారా సమితి తమ పార్టీలో విలీనమవుతుందన్నారు. రాష్ట్ర పార్టీలో నూతన ఉత్సాహం కనిపిస్తోందన్నారు.

English summary
Former Home Minister Sabitha Indra Reddy has said that she is innocent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X