కెసిఆర్ పొత్తెలా పెట్టుకున్నారు, అన్నింట్లో జగనే: బాబు

తెలంగాణ విషయంలో టిడిపిలో స్పష్టత ఉన్నప్పటికీ తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తమనే టార్గెట్ చేయడం వెనుక అర్థం ఏమిటో చెప్పాలన్నారు. నేతలు వెళ్లినా క్యాడర్ మాత్రం పార్టీతోనే ఉందన్నారు. గతేడాది జరిగిన అఖిలపక్షంలోను తాము తెలంగాణపై స్పష్టత ఇచ్చామన్నారు. తెలంగాణ అభివృద్ధి టిడిపితో కాకుండా తెరాసతో జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. కెసిఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే బీడి కట్టలపై పుర్రె గుర్తు వచ్చిందన్నారు.
తెలంగాణలో ఆదాయం కెసిఆర్ వల్ల పెరిగిందా అని ఘాటుగా ప్రశ్నించారు. బాబ్లీపై పోరాటం చేసింది టిడిపియే అన్నారు. శ్రీరామ్ సాగర్‌లో ప్రస్తుతం ఒక్క చుక్క నీరు లేదని దీనికి ఏం సమాధానం చెబుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపియే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందన్నారు. అధికారంలోకి రాగానే విద్యార్థులపై కేసులను ఎత్తి వేస్తామన్నారు. కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ వస్తుందన్నారు. మహానాడులో తెలంగాణపై చర్చించుదామన్నారు. తెరాసతో పొత్తు లేకుంటే తాము 2009లోనే గెలిచావాళ్లమన్నారు.
సిబిఐ అన్ని ఛార్జీషీట్లలోను జగన్‌ను దోషిగా చూపిందని అన్నారు. మంత్రులకు తెలియకుండా అవినీతి జరగలేదన్నారు. కళంకిత మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. టిడిపి పోరాటం వల్లనే సబిత, ధర్మానలు రాజీనామా చేశారన్నారు. కాంగ్రెసు దొంగల రైలు అని, ఇప్పుడు డ్రైవర్ మాత్రమే మారాడన్నారు. వైయస్ అవినీతిని సమర్థించిన మొదటి వ్యక్తి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే అన్నారు. ప్రస్తుతం జైలులో ఉన్న వారు భవిష్యత్తులో జైలుకు వెళ్లే వారే జగన్ పార్టీ తరఫున పోటీ చేస్తారన్నారు.












Click it and Unblock the Notifications