ఏడ్చేసిన శ్రీశాంత్ తల్లి: ఆ రోజు ఇద్దరు గర్ల్స్‌తో జల్సా

Sreeshanth and Savithri devi
న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టయి పోలీసు కస్టడీలో ఉన్న శ్రీశాంత్‌ను అతని తల్లి సావిత్రీ దేవి, సోదరి వివేదిక కలుసుకున్నారు. శ్రీశాంత్‌ను ఆలింగనం చేసుకుని ఇరువురు కూడా బోరున విలపించారు. లోడీ కాలనీలోని స్పెషల్‌ సెల్‌లో శ్రీశాంత్ ఉన్నాడు. శ్రీ త్వరగా విడుదల కావాలని కోరుకుంటున్నట్లు శ్రీశాంత్ తల్లి ఆకాంక్షించింది.

సిసిటీవి ఫుటేజీ 9వ తేదీ శ్రీశాంత్ వ్యవహారాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. శ్రీశాంత్ పంజాబ్‌తో మ్యాచ్ అనంతరం రాత్రి ఇద్దరు అమ్మాయిలతో జల్సా చేసినట్టు సీసీ టీవీ ఫుటేజ్‌లో కనిపించింది. మరో ఆటగాడు అంకిత్ చవాన్‌తోపాటు శ్రీశాంత్ కూడా ఆ రోజు రాత్రే బుకీ జిజు జనార్థన్ నుంచి గిఫ్ట్ ప్యాకెట్‌లు అందుకున్నారు.

మే 9న మొహాలీ వేదికగా పంజాబ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీశాంత్, చండీలా, చవాన్‌లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టుగా ఆధారాలు లభించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించింది. కాగా రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు బస చేసిన చండీగఢ్‌లోని ఓ హోటల్లోని సీసీ ఫుటేజ్‌లను ఒక న్యూస్ చానెల్ ఆదివారం బయటపెట్టింది. కోర్టు అనుమతితో పంజాబ్, ఢిల్లీ పోలీసులు ఈ ఫుటేజ్‌ని సేకరించారు.

సిసి టీవి ఫుటేజీ వివరాల ప్రకారం - ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత శ్రీశాంత్, చవాన్‌లు ఆ రోజు రాత్రి 7:30 ప్రాంతంలో హోటల్‌కు చేరుకున్నారు. 10.15కు చేతిలో గిఫ్ట్ ప్యాకెట్ పట్టుకుని బుకీ జిజు జనార్దన్‌తో కలిసి వచ్చిన చవాన్ శ్రీశాంత్ గది తలుపు తట్టాడు. బయటికొచ్చిన శ్రీశాంత్ లాబీలో వారిద్దరితో కొద్దిసేపు మాట్లాడాడు. ఓ పది నిమిషాల తర్వాత బ్లాక్ డ్రెస్‌లో వచ్చిన సుమారు 20 ఏళ్ల వయసుండే ఓ అమ్మాయి ఈ ముగ్గురినీ కలిసింది. వీళ్లు అక్కడ మాట్లాడుకుంటుండగానే మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి చేరారు.

అనంతరం శ్రీ లోపలికి వెళ్లి డ్రెస్ మార్చుకుని వచ్చాడు. 10:55 సమయంలో చవాన్, శ్రీశాంత్ ఆ అమ్మాయితో కలిసి హోటల్ నుంచి బయటకు వెళ్లిపోయారు. మరో నాలుగు గంటల తర్వాత శ్రీశాంత్ మరో అమ్మాయితో హోటల్ లాబీలో ప్రత్యక్షమయ్యాడు. ఆ అమ్మాయి వైట్ అండ్ బ్లాక్ పార్టీ వేర్ డ్రెస్‌లో ఉంది. అప్పుడు సమయం 2:19 నిమిషాలు. చవాన్ వెనకే వచ్చిన శ్రీశాంత్ ఆ అమ్మాయిని తన రూమ్‌లోకి తీసుకెళ్లాడు. 3:55కి శ్రీశాంత్ బయటకు వచ్చాడు. ఆ సమయంలో ఫుల్లుగా తాగి ఉన్న శ్రీ పడుతూ లేస్తూ కనిపించాడు.

చవాన్ వచ్చేంతవరకు అతడు లాబీలో అలా తూగుతూనే ఉన్నాడు. కొద్దిసేపటికే అక్కడికొచ్చిన చవా న్ అతణ్ని అక్కడి నుంచి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఇద్దరూ రెండు గంటలపాటు కనిపించలేదు. 5:35కి చేతిలో ప్యాకెట్ పట్టుకుని శ్రీశాంత్ లాబీలోకి వచ్చాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+