నిబంధన: సంజయ్‌దత్ ఇంటి భోజనానికి అధికారులు నో

కేవలం అండర్ ట్రయల్స్‌కు మాత్రమే అభ్యంతరాలు లేవని, సంజయ్ దత్ నేరస్తుడుగా రుజువయినందున ఇంటి భోజనంకు జైలు మ్యాన్యువల్ అంగీకరించదని జైలు అధికారులు చెబుతున్నారు. దీంతో సంజయ్ దత్‌కు అతని స్నేహితుడి ఇంటి నుండి భోజనం తెచ్చుకునేందుకు అనుమతి లభించడం లేదట.
కాగా, జైలులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌కు పేపర్ ఫైళ్ల తయారీ, పేపర్ బైండింగ్ వర్క్ అప్పగించినట్లు సమాచారం. 1993 బాంబు పేలుళ్ల కేసులో సంజయ్ దత్ 42 నెలల జైలు జీవితాన్ని అనుభవించాల్సి ఉన్న విషయం తెలిసిందే. భద్రత కారణాల రీత్యా సంజయ్ దత్‌ను ఇతర ఖైదీలతో కలవకుండా జైలు అధికారులు చూస్తున్నట్లు సమాచారం.
ఇతర ఖైదీలతో కలిసే అవకాశం లేకుండా ఒంటరిగా జైలులోనే కూర్చుని చేసేందుకు వీలుగా సంజయ్ దత్‌కు పేపర్ ఫైళ్ల తయారీ, పేపర్ బైండింగ్ వర్క్‌లను అధికారులు అప్పగించినట్లు చెబుతున్నారు. మరింత వెసులుబాటు కల్పించడానికి సుప్రీం కోర్టు నిరాకరించడంతో సంజయ్ దత్ టాడా కోర్టు ముందు లొంగిపోయారు.
ఆయనను ఆర్థర్ రోడ్ జైలు నుంచి అతి రహస్యంగా యెరవాడ జైలుకు తరలించారు. గతంలో జైలులో ఉన్నప్పుడు సంజయ్ దత్‌కు నిట్టింగ్ యార్న్ కేన్ చైర్ల తయారీ పనిని అధికారులు అప్పగించారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత సంజయ్ దత్ తయారు చేసిన కుర్చీని ఒకదాన్ని వేలం వేశారు. పని పూర్తి చేసిన తర్వాత ఖైదీలకు 25 నుంచి 40 రూపాయల వరకు చెల్లిస్తారు.
మంచి పనికి, మంచి ప్రవర్తనకు జైలు జీవితంలో కొంత ఊరట కూడా ఇస్తారు. ఖైదీలు ఫర్నీచర్, క్యాండిల్ స్టాండులు, దైనందిన జీవితంలో వాడడానికి వీలయ్యే వస్తువులు తయారు చేస్తున్నారు. వాటిని రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలకు సరఫరా చేస్తారు.












Click it and Unblock the Notifications