ఫిక్సింగ్: పోలీసుల స్కాన్‌లో 10మంది యుపి క్రికెటర్లు

ఇటీవల ఐపిఎల్ 6లో పాల్గొన్న రాష్ట్రానికి చెందిన క్రికెటర్ల పైన యూపి పోలీసులు స్కాన్‌లో పెట్టారట. వారిలో చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన సురేష్ రైనా, పుణే వారియర్స్‌కు చెందిన భువనేశ్వర్ కుమార్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు రుద్ర ప్రతాప్ సింగ్‌లను స్కాన్‌లో పెట్టారట.
వీరి ముగ్గురితో పాటు మిగతా జట్ల తరఫున ఐపిఎల్ 6లో ఆడిన అలీ ముర్తజా(పుణే వారియర్స్), ప్రవీణ్ కుమార్, పీయూష్ చావ్లా(కింగ్స్ ఎలెవన్ పంజాబ్), ఇంతియాజ్ అహ్మద్, అంకిత్ సింగ్ రాజ్‌పుట్(చెన్నై సూపర్ కింగ్స్), ఏకలవ్య ద్వివేది(పూణే వారియర్స్) తదితర ఆటగాళ్లను విచారించే అవకాశాలు ఉన్నాయి.
కేసును విచారిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. తాము స్వతంత్రంగా కేసును దర్యాఫ్తు చేస్తున్నామన్నారు. స్పాట్ ఫిక్సింగ్‌లో ఉన్న వారిని ప్రశ్నిస్తామని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications