బాబు, కెసిఆర్‌లకు షాక్: మర్రి గుడ్‌బై, రాజయ్య వెనక్కి

తెలంగాణపై టిడిపిలో స్పష్టత లేదని భావించిన మర్రి జనార్ధన్ రెడ్డి ఈ రోజు ఫ్యాక్స్ ద్వారా చంద్రబాబుకు రాజీనామా లేఖను పంపించారు. ఆయన గత కొన్నాళ్లుగా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డితో టచ్‌లో ఉంటున్నారు. దీంతో అతను భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 3వ తేదిన నాగంతో పాటు నిజాం కళాశాల మైదానంలో జరిగే బిజెపి బహిరంగ సభలో ఆ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి.
రాజయ్య వెనక్కి
కాంగ్రెసు పార్టీ తెలంగాణపై స్పష్టత ఇవ్వకపోవడంతో తెరాసలోకి చేరుతారని భావిస్తున్న వరంగల్ ఎంపీ రాజయ్య ఇప్పుడు వెనక్కి తగ్గారు. తనకు వరంగల్ పార్లమెంటు సీటు పైన కెసిఆర్ హామీ ఇవ్వనందువల్లే ఆయన వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే టిడిపి నుండి చేరిన కడియం శ్రీహరికి వరంగల్ పార్లమెంటు స్థానంపై హామీ ఇచ్చారు. మానకొండూరు సీటు కోసం పలువురు పోటీలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో రాజయ్యకు కెసిఆర్ నుండి హామీ రాలేదని సమాచారం. దీంతో తెరాసలోకి వెళ్తే వచ్చేదేమీ లేదని భావించిన రాజయ్య కాంగ్రెసులోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. మిగతా ఇద్దరు ఎంపీలు వివేక్, మంద జగన్నాథంలకు మాత్రం హామీ వచ్చినందున వారు తెరాస తీర్థం పుచ్చుకోనున్నారు.












Click it and Unblock the Notifications