ఏడేళ్ల గర్ల్‌ని అపహరించి దారుణం, లిఫ్ట్ పేరుతో మరోచోట

Youth abducts 7 year old girl
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిలో ఓ వ్యక్తి ఏడేళ్ల యువతిని అపహరించిన సంఘటన చోటు చేసుకుంది. మీర్‌పేట ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల రవి అనే యువకుడు ఏడేళ్ల బాలికను అపహరించి, ఆమెపై అత్యాచారం చేశాడు. బాలిక తన తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పడంతో వారు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

బాధితురాలు రెండో తరగతి చదువుతోంది. బాధితురాలు తన ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో నిందితుడు ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వెళ్లాడు. స్వీట్స్ ఆశ చూపి ఆమెను దగ్గరకు రప్పించుకున్నాడు. అక్కడి నుండి జెఎన్ఎన్‌యుఆర్ఎమ్ భవంతిలోకి తీసుకు వెళ్లి అత్యాచారం చేశాడు.

బాలికపై ఆర్ఎంపీ అత్యాచారం

ఓ బాలికపై ఆర్ఎంపీ డాక్టర్ అత్యాచారం చేయడంతో ఆమె మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఖమ్మం జిల్లా గుండాల మండలంలో చోటు చేసుకుంది. గుండాల పోలీసుల కథనం ప్రకారం.. ఇల్లందు మండలానికి చెందిన సతీష్ గుండాలలో ఆర్ఎంపీగా పని చేస్తున్నాడు.

మంగళవారం సొంత పనిపై తన ద్విచక్రవాహనంపై ఇల్లెందు వెళ్లాడు. పదహారేళ్ల ఓ బాలిక ఇల్లందు బస్టాండులో ఆగింది. తన వాహనంలో వెళ్తున్న సతీష్‌ను తన గ్రామం స్టేజ్ వద్ద దింపమని కోరింది. ఆమెను ఎక్కించుకున్న అర్ఎంపి డాక్టర్ సమీపంలోని అడవిలోకి రాగానే అత్యాచారం చేశాడు.

ఆ తర్వాత బాలికను స్టేజ్ వద్ద దింపాడు. ఆమె ఇంటికి వెళ్లకుండా రాత్రి అక్కడే ఉండింది. మనస్తాపంతో బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో ఆర్ఎంపి డాక్టర్‌కు దేహశుద్ధి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+