మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమోషన్: జగన్ విడుదల కోసం యువకుడు ఆత్మహత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

YSR Congress
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి విడుదల కోరుతూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ పట్టణంలోని గాంధీ నగర్‌లో చోటు చేసుకుంది. ఆ యువకుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్త కూడా. ఇది బుధవారం వెలుగు చూసింది.

సమాచారం మేరకు.. కె సుధాకర్ అనే ఇరవై ఎనిమిదేళ్ల వ్యక్తి జగన్‌కు పెద్ద అభిమాని. గతేడాది జగన్ అరెస్టుయిన సమయంలో అతను సెల్ టవర్ ఎక్కి హంగామా చేశాడు. జగన్ అరెస్టును నిరసిస్తూ టవర్ ఎక్కిన ఆయన తాను పైనుండి దూకుతానని హెచ్చరించాడు. అప్పుడు పోలీసులు నచ్చజెప్పి అతనిని కిందకు దించారు.

జగన్ అరెస్టై ఏడాది గడిచినా ఇంకా విడుదల కాకపోవడంతో మనస్తాపానికి గురైన అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయాడు. ఇతనికి పద్నాలుగు రోజుల క్రితమే వివాహమైంది. మెదక్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ... సుధాకర్ గతంలో సెల్ టవర్ నుండి దూకే ప్రయత్నాలు చేశాడని, ఈ విషయంలో అతనిపై కేసు నమోదయిందన్నారు.

అతని ప్యాంట్ జేబు నుండి ఓ సూసైడ్ నోట్ తీసుకున్నామని చెప్పారు. అతను తన నోట్‌లో జగన్ విడుదలను కోరుకున్నారని చెప్పారు. మంగళవారం సుధాకర్ జగన్ అరెస్టును నిరసిస్తూ చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్నాడని చెప్పారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన సుధాకర్ ఇంటి తలుపు గడియ పెట్టుకొని ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడని చెప్పారు.

English summary
A youth has committed suicide reportedly seeking the 
 
 release of YSRC president Y.S. Jaganmohan Reddy. The 
 
 incident took place at Gandhi Nagar of Medak town 
 
 late Tuesday night and came to light on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X