ఫిక్సింగ్‌ను పక్కన పెట్టండి, మాట్లాడను: ధోనీ

ఈ రోజు అతను దీనిపై పెదవి విప్పాడు! ఛాంపియన్స్ ట్రోపీ కోసం భారత జట్టు ప్రస్తుతం బర్మింగ్‌హోంలో ఉంది. అక్కడ అతనుమీడియా ప్రతినిధులతో మాట్లాడాడు. ప్రస్తుతం ఫిక్సింగ్ అంశానికి సంబంధించిన ప్రశ్నలపై స్పందించడం తనకు ఇష్టం లేదన్నాడు. ఫిక్సింగ్ వివాదంపై ఇప్పుడు స్పందించనన్నారు.
సరైన సమయంలో ఆ వివాదంపై మాట్లాడుతానని అన్నారు. తాను ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ గురించి మాట్లాడేందుకు మాత్రమే వచ్చానని చెప్పాడు. ఐపిఎల్ 6 వివాదాన్ని ప్రస్తుతానికి తాను పూర్తిగా పక్కకు పెట్టానని చెప్పాడు. ఈ వివాదం వల్ల భారత క్రికెటర్లు ప్రతిష్టను కోల్పోలేదన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఉత్తమ ప్రదర్శన కనబరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఉత్తమ ప్రదర్శన కనబర్చని పక్షంలో ఐపిఎల్‌ను తప్పు పట్టవలసిన అవసరం లేదన్నాడు.












Click it and Unblock the Notifications