గెలిచేందుకా, తెలంగాణ కోసమా?: టి ఎంపీలకు బలరాం

Balaram Naik
న్యూఢిల్లీ: తమ పార్టీకి చెందిన ఇద్దరు పార్లమెంటు సభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వచ్చే ఎన్నికలలో గెలిచేందుకు వెళ్లారా? లేక తెలంగాణ కోసం వెళ్లారా? చెప్పాలని కేంద్రమంత్రి బలరామ్ నాయక్ శుక్రవారం ప్రశ్నించారు. ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఈరోజు ఉదయం భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

తెలంగాణ కోసం కేంద్రం, అధిష్టానం ఏకాభిప్రాయం కోసం ప్రయత్నాలు చేస్తోందన్నారు. తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర వాదన ఉందన్నారు. తెలంగాణపై కాంగ్రెసు ప్రకటన చేసిందని, ఎప్పటికైనా ఏర్పాటు చేసేది తమ పార్టీయే అన్నారు. తాము తెలంగాణ కోసం పార్టీలో ఉండి పోరాటం చేస్తామన్నారు.

మంద జగన్నాథం, వివేక్, కె కేశవ రావులు తెరాసలోకి వెళ్లడం వారి వ్యక్తిగత అభిప్రాయం అన్నారు. తమతో వారు కలిసి మాట్లాడలేదని చెప్పారు. వారికి వెళ్లే హక్కు ఉందన్నారు. అయితే వారు వెళ్లింది వచ్చే ఎన్నిగల్లో గెలిచేందుకా లేక తెలంగాణ కోసమా అనేది చెప్పాలన్నారు. వారు సొంత ఆలోచనలతో వెళ్లారన్నారు.

తెలంగాణపై అన్ని రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాన్ని చెప్పాలన్నారు. కాంగ్రెసు మాత్రమే తెలంగాణ ఇవ్వగలుగుతుందన్నారు. తాను మంత్రి పదవి కోసం పార్టీలో లేనని, భారత దేశానికి స్వాతంత్రం వచ్చాక చాలా ఏళ్ల తర్వాత గిరిజన నాయకుడికి మంత్రి పదవి వచ్చిందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+