కాంగ్రెసులో ఉంటే వెన్నుపోటు పొడిచినట్లే: కేశవరావు

కాంగ్రెసు తెలంగాణపై హామీల మీద హామీలు ఇచ్చుకుంటూ వచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణ కోసం కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు చాలా ప్రయత్నాలు చేశారని, ఆందోళనలు చేశారని, కానీ ఆంధ్ర నాయకుల వల్ల ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని ఆయన అన్నారు. కాంగ్రెసు తెలంగాణ వ్యతిరేక పార్టీగా మిగిలిపోతుందని ఆయన అన్నారు.
కాంగ్రెసు పార్టీపై తనకు ఏ విధమైన కోపం లేదని చెప్పారు. తెలంగాణకు ఎంతో చరిత్ర ఉందని అన్నారు. తెలంగాణ విషయంలో ఏ పార్టీని కూడా తాను కించపరచదలుచుకోలేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత నాయకుల్లో కూడా నిజాయితీ కనిపిస్తోందని, అయితే పార్టీ నాయకత్వంతోనే సమస్య వస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సరైన వేదిక అని తాను నమ్ముతున్నట్లు ఆయన తెలిపారు.
కాంగ్రెసు పార్టీ తనకు అన్నీ ఇచ్చిందని, కానీ తనకు తెలంగాణ ముఖ్యమని అన్నారు. కాంగ్రెసు నాయకులకు తాను ఏమైనా బాధ కలిగించి ఉంటే క్షమించాలని, తన సెంటిమెంటును అర్థం చేసుకోవాలని కేశవరావు అన్నారు. కాంగ్రెసులో ఉండి తాము తెలంగాణ కోసం పోరాడమని, కానీ ఆంధ్ర నాయకుల వల్ల తెలంగాణ సాధన సాధ్యం కాలేదని అన్నారు.












Click it and Unblock the Notifications