అంత అహంకారమొద్దు: సిఎం 'డెడ్‌లైన్'పై కెటిఆర్ ఫైర్

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ వంటి డూప్లికేట్ గాంధీల నాయకత్వంలో జాతిపిత మహాత్మా గాంధీ నేర్పిన విలువలను తుంగలో తొక్కారన్నారు. పెట్టుబడిదారులైన ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావుల వంటి వారిని బుజ్జగించి తెలంగాణ ఎంపిల పట్ల వివక్ష వహించడమేమిటని ప్రశ్నించారు. సీమాంధ్ర ఎంపీలకు ఓ న్యాయం, టిఎంపీలకు ఓ న్యాయమా అని మండిపడ్డారు.
తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలకు ఆ పార్టీలో గౌరవం లేదని, తెలంగాణవాదులకు కనీస గౌరవం లేదని, ఈ ప్రాంత కాంగ్రెసు నేతలు తమ ఆత్మగౌరవం చంపుకొని అందులో కొనసాగడమెందుకన్నారు. అందులోనే కొనసాగితే తెలంగాణ ప్రజలను అవమానించడమే అన్నారు. ముఖ్యమంత్రి అహంకారపు మాటలు మానుకోవాలని సూచించారు. తెలంగాణలో కాంగ్రెసును సమాధి చేసేందుకు కిరణ్ కంకణం కట్టుకున్నారన్నారు.
గురువారం పార్లమెంటు సభ్యుల చేరిక ఆరంభం మాత్రమేనని, త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయన్నారు. కాగా, గురువారం రాత్రి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... కాంగ్రెసు పార్టీ ఎంపీల రాజీనామా వారి వ్యక్తిగతమని, కార్యకర్తలకు ఏదైనా సమస్య ఉంటే పార్టీ అధిష్టానానికి చెప్పుకోవాలే గానీ డెడ్‌లైన్లు పెట్టడం సరికాదని విమర్శించారు. దీనిపై కెటిఆర్ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications