వైయస్ జగన్‌కు ఈడి మరో షాక్: రూ. 34 కోట్లు జప్తు

ఎకె దండమూడి, కన్నన్, మాధవ్ రామచంద్రన్ పెట్టిన పెట్టుబడులను జప్తు చేస్తున్నట్లు ఈడి తెలిపింది. కుట్ర, మోసం ద్వారా నేరానికి పాల్పడినట్లు నిర్ధారణ అయిందని, అందుకే ఫిక్స్‌డ్ డిపాజిట్లను జప్తు చేస్తున్నామని ఈడి తెలిపింది. కన్నన్ జగన్ సంస్థల్లో ఐదు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినట్లు సమాచారం. మాధవ్ రామచంద్రన్ దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త.
ప్రస్తుత జప్తుతో ఈడి ఇప్పటి వరకు మూడు సార్లు జగన్ కేసులో అస్తులను జప్తు చేసినట్లయింది. మూడు విడతలు మొత్తం 229.40 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను ఈడి జప్తు చేసింది. ఇంతకు ముందు 143.74 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను, మూడు ఫార్మా కంపెనీలకు, జననీ, జగతి సంస్థలకు సంబంధించి 51 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను ఈడి జప్తు చేసింది.
నాలుగవ విడత జగన్ కేసులో 800 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్ల ఆధారంగా విచారణ చేపట్టిన ఈడి దూకుడుగా వ్యవహరిస్తూ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే శుక్రవారం మూడో విడత ఆస్తుల జప్తునకు దిగింది.












Click it and Unblock the Notifications