పైశాచికానందం, నోరు హద్దులో పెట్టుకో: బాబుపై వివేకా

కాంగ్రెస్, టిడిపిలు జగన్ పైన వ్యక్తిగత విమర్సలు చేయడం సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నోటిని అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని సూచించారు. ముఖ్యమంత్రిగా పని చేసిన అలాంటి వ్యక్తి సంయమనంతో మాట్లాడాలని సలహా ఇచ్చారు.
కాగా, వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. శుక్రవారం షర్మిల పాదయాత్ర 165వ రోజు. ఈ రోజు ఆమె 12.2 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇరగపురం, గోటేరు అడ్డరోడ్డు, గోపాలపురం, తణుకు మునిసిపల్ ఆఫీస్, రాష్ట్రపతి రోడ్డు, నరేంద్ర సెంటర్, వెంకటేశ్వర థియేటర్ మీదుగా యాత్ర సాగుతుంది.
గురువారం పాదయాత్ర చేసిన షర్మిలకు రైతులు, మహిళలు తమ బాధలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె వారికి హామీ ఇచ్చారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రామరాజ్యం తీసుకు వస్తారన్నారు. జగన్‌ను గెలిపించేందుకు అందరు కృషి చేయాలన్నారు.
జగన్‌ను అణగదొక్కేందుకు కాంగ్రెసు సిబిఐని ఉపయోగించుకుంటోందని శిరోమణి అకాలీదళ్ నేత నరేష్ గుజ్రాల్ ఢిల్లీలో అన్నారు. సిబిఐని దుర్వినియోగం చేయడం తగదన్నారు. తమను కాదన్నందుకే కాంగ్రెసు జగన్ పైన సిబిఐని ప్రయోగిస్తోందని యశ్వంత్ సిన్హా అన్నారు.












Click it and Unblock the Notifications