రాజకీయాలు, ఆటలు కలువొద్దు: ఐపిఎల్‌పై మన్మోహన్

పార్లమెంటు సమావేశాలలో విపక్షాల తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వారిని తప్పుపట్టారు. సమావేశాలు జరగకుండా విపక్షాలు అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నారు. లెఫ్ట్, తృణమూల్ కాంగ్రెసు పొత్తులపై ఆయన పై విధంగా స్పందించారు.
కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించాల్సిన అవసరముందన్నారు. మంత్రివర్గంలోని ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు. ఇదే అంశాన్ని తాము పరిశీలిస్తున్నామని ప్రధాని చెప్పారు. రాబోయే రోజుల్లో ద్రవ్యోల్భణం తగ్గుముఖం పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్ పైన స్పందిస్తూ... రాజకీయాలు, క్రీడలు వేరువేరు అంశాలు అన్నారు. అవి రెండు కలిసిపోవద్దన్నారు. ఫిక్సింగ్ వ్యవహారంలో దర్యాఫ్తు జరుగుతోందని, ఇలాంటి సమయంలో మాట్లాడటం సరికాదని మన్మోహన్ సింగ్ ఈ సందర్భంగా అన్నారు.
మావోయిస్టులపై షిండే
మావోయిస్టుల దాడి ఉగ్రవాదాని కంటే తీవ్రమైనదని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లో అన్నారు. దాడి జరిగినప్పుడు తాను విదేశీ పర్యటనలో ఉన్నానని చెప్పారు. ఈ ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications