జగన్ పొలిటికల్ బుకీ, పాలు పోశారు: ఆనం వివేకా

రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు కాంగ్రెసును వీడి తెరాసలోకి వెళ్లడం మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమని ఆర్టీసి మాజీ చైర్మన్ గోనె ప్రకాశరావు అన్నారు. గెలిచిన తర్వాత పార్లమెంటు సభ్యులందరితో పాటు కేశవరావు మళ్లీ కాంగ్రెసుకు వెళ్తారని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. వ్యక్తిగతంగా ప్రయోజనం పొందేందుకే కేశవరావు ఈ డ్రామా ఆడుతున్నారని ఆయన అన్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డిని విమర్శించే హక్కు, అర్హత కేశవరావుకు లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మాదిరిగా తెలంగాణపై పూటకో అబద్ధం చెప్పడం కెకెకు అలవాటు అని ఆయన అన్నారు. నలబై ఏళ్లుగా కాంగ్రెసులో ఉన్నానని కెకె చెప్పడం పచ్చి అబద్ధమని ఆయన అన్నారు.
కాంగ్రెసు పార్టీలో ఎన్నో కీలక పదవులు అనుభవించిన కె. కేశవ రావు పార్టీని వీడడం బాధాకరమని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. సమైక్యవాద పార్టీలకు వచ్చే ఎన్నికల్లో 270 సీట్లు వస్తాయని ఆయన శనివారం విజయవాడలో మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎన్నికల సమయంలో నేతలు పార్టీలు మారడం సాధారణమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications